తైవాన్ జామ పండ్ల సాగులో అధిక దిగుబడి కోసం మెళుకువలు..!

తైవాన్ జామ సాగులో( Taiwan guava cultivation ) అధిక లాభాలు వస్తూ ఉండడంతో చాలామంది రైతులు( Farmers ) తైవాన్ జామ సాగు పై అధిక ఆసక్తి చూపిస్తున్నారు.ఈ పంట సాగుపై సరైన అవగాహన ఉంటే అధిక దిగుబడులు సాధించవచ్చు.

 Techniques For High Yield In Taiwan Guava Cultivation , Taiwan Guava Cultivati-TeluguStop.com

ఈ పంట సాగులో పాటించాల్సిన సరైన మెళుకువలు ఏమిటో తెలుసుకుందాం.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 250 తైవాన్ జామ చెట్లను నాటి సాగు చేయవచ్చు.

ఒక్కొక్క మొక్కకు 25 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల నత్రజని, 500 గ్రాముల భాస్వరం ఎరువులను మార్చి నెలలో మొక్కలకు అందించాలి.అక్టోబర్ నెలలో కూడా ఇదే మోతాదులో ఎరువులను మొక్కలకు అందించాలి.అక్టోబర్ నెలలో ఒక శాతం యూరియా, 0.5శాతం జింక్ సల్ఫేట్ ను జామ చెట్ల ఆకులపై రెండుసార్లు పిచికారి చేయడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.పొలంలో బోరాన్ లోపం ఉంటే, పిందె సమయంలో 0.3 శాతం బోరాక్స్ మొక్కలపై పిచికారి చేయాలి.

Telugu Agriculture, Farmers, Fertilizers, Guava, Yields, Pest, Taiwan Guava, Zin

జామ పండ్ల సాగులో కొమ్మ కత్తిరింపులు ఎంతో కీలకం.జామ మొక్క 75 సెంటీమీటర్ల ఎత్తు పెరిగినప్పుడు, 50 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు మొక్క కత్తిరింపులు జరపాలి.కొమ్మలు గొడుగుల మధ్య కాండం చుట్టూ విస్తరించి ఉండేలా చూసుకోవాలి.

Telugu Agriculture, Farmers, Fertilizers, Guava, Yields, Pest, Taiwan Guava, Zin

పంట కోతల తరువాత వసంతకాలంలో కొమ్మ కత్తిరింపులు జరపాలి.ఎండాకాలంలో కొమ్మ కత్తిరింపులు చేయకూడదు. కొమ్మ కత్తిరింపులు జరిపేటప్పుడు రూట్ సర్కర్, నీటి మొలకలు, అవసరం లేని కొమ్మలను తప్పనిసరిగా తొలగించాలి.

ఎత్తును నియంత్రించడానికి, అంచున ఉన్న రెమ్మల ఎత్తును నియంత్రించడం కోసం కొమ్మ కత్తిరింపులు చేస్తారుతైవాన్ జామ పండ్ల చెట్లకు పేనుబంక, లార్వాలు ఆశించి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది.వీటిని మొక్కలపై గుర్తించిన తర్వాత టెబ్రాన్ 0.2% కీటక నాశినీ తో పిచికారి చేయాలి.జామ పండ్లపై మచ్చలు కనిపించిన లేదంటే డౌనీ బూజు తెగులు( pest ) గమనిస్తే రిడోమిల్ 0.2% ను పిచికారీ చేయాలి.ఒక్కొక్క చెట్టు నుండి దాదాపుగా 40 కిలోల పంట దిగుబడి పొందవచ్చు.

ఈ లెక్కన ఒక ఎకరం పొలం పొలం నుంచి పది లక్షల పంట పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube