రేయింబవళ్లు 14 గంటలు పని.. 7 కోట్ల ప్రమోషన్.. కానీ భార్య చేసిన పనికి షాకవ్వాల్సిందే..

అతడు ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీలో సీనియర్ మేనేజర్( Senior Manager ) స్థాయికి ఎదిగాడు.జీతం అక్షరాలా సంవత్సరానికి రూ.

7.8 కోట్లు.మూడేళ్లు పగలనక రాత్రనక కష్టపడ్డాడు.

అనుకున్నది సాధించాడు.కానీ, ఇప్పుడు ఆ సంతోషం లేదు.

గుండె నిండా శూన్యం.అవును, బ్లైండ్( Blind ) అనే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్‌పై ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ ఇది.తన జీవితాన్ని ఉద్యోగం( Job ) ఎలా మింగేసిందో చెప్పాడు.ఉదయం 7 గంటలకు మొదలయ్యే మీటింగ్‌లు రాత్రి 9 వరకు ఉండేవి.

కుటుంబానికి( Family ) టైమే లేదు.కూతురు పుట్టినపుడు పక్కన ఉండలేకపోయాడు.

Advertisement
Techie Got Promotion And Salary Increment To 7 Crore Rupees But Wife Files For D

పుట్టిన తర్వాత భార్య పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో బాధపడుతుంటే కనీసం ఓదార్చనూ లేదు.భార్య థెరపీకి రమ్మంటే ఆఫీస్ పని అంటూ తప్పించుకున్నాడు.

ఫలితం, నేరుగా విడాకులు.

Techie Got Promotion And Salary Increment To 7 Crore Rupees But Wife Files For D

ప్రమోషన్ వచ్చిందని సంబరపడాలో లేక కుటుంబం దూరం అయిందని బాధపడాలో తెలియని పరిస్థితి అతనిది. "లేఆఫ్ ల కాలంలో ఇంత జీతం వస్తుంది, సంతోషంగా ఉండాలి కదా? కానీ ఎలా ఉండాలి?" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చాలా మంది అతనికి మద్దతుగా నిలిచారు.వర్క్-లైఫ్ బ్యాలెన్స్( Work-Life Balance ) ఎంత ముఖ్యమో చెప్పే గుణపాఠం ఇదని అన్నారు.

Techie Got Promotion And Salary Increment To 7 Crore Rupees But Wife Files For D

కొందరేమో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశావంటూ విమర్శించారు."ప్రమోషన్ వచ్చిన రోజు ఎవరికీ గుర్తుండదు, కానీ కుటుంబంతో గడిపిన క్షణాలే జీవితాంతం గుర్తుంటాయి" అని ఒకరు కామెంట్ చేశారు.మొత్తానికి ఈ ఉదంతం కెరీర్ కోసం ఎంత త్యాగం చేయాలి? అనే ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది.ఏదేమైనా పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీ కోసం తగిన సమయం ఇవ్వాలి.

Advertisement

లేకపోతే వారిని దూరం చేసుకోక తప్పదు.కెరీర్ మాత్రమే ముఖ్యం అనుకుంటే పెళ్లి చేసుకోకుండా ఉండాలని కొంతమంది సలహా ఇస్తున్నారు.

తాజా వార్తలు