నేడే టీమిండియా, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ ప్రారంభం.. ఏ జట్టు స్ట్రాంగ్‌గా ఉందంటే?

న్యూజిలాండ్‌, టీమ్ఇండియా జట్ల మధ్య ఇటీవలే టీ20 సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే.ఇందులో భారత్ 3-0 తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.

అయితే ఈ రోజు అనగా నవంబర్ 25 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ ప్రారంభమైంది.ఈ సిరీస్‌లో ఆడే ఇరు జట్లు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి? ఏ జట్టు గెలుపు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.గురువారం నాడు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

వాస్తవానికి భారతదేశంలో జరిగిన ఏ టెస్ట్ సిరీస్‌లోనూ న్యూజిలాండ్ గెలవలేదు.కానీ ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ దూరమవుతుండటంతో అజింక్య రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.కేఎల్ రాహుల్ తొడ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు.

Advertisement
Team India, New Zealand Test Series Starts Today .. Which Team Is Strong Team In

మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, రిషబ్ పంత్ విశ్రాంతి తీసుకుంటున్నారు.ఇలా కీలక క్రికెటర్లందరూ మ్యాచ్‌కు దూరం కావడంతో ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా గెలుస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.ఈ మ్యాచ్ టాస్ ఉదయం 9 గంటలకు జరిగితే.9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Team India, New Zealand Test Series Starts Today .. Which Team Is Strong Team In

టీమిండియా ఓపెనర్ల విషయానికొస్తే.బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ మొదటగా బ్యాటింగ్‌కు దిగి మంచి ఆరంభాన్ని అందించే అవకాశముంది.మయాంక్‌ స్వదేశంలో జరిగిన అన్ని టెస్ట్ మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణించాడు.

శుభ్‌మన్‌ గిల్‌ కూడా టెస్ట్ మ్యాచ్‌ల్లో తన సత్తా చాటాడు.కాగా మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్) ఆడనున్నారు.

స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ బౌలింగ్‌తో న్యూజిలాండ్ వికెట్లను తక్కువ పరుగులకే తీయగలరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇంకా ఫాస్ట్ బౌలర్స్ అయిన మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మలతో టీమిండియా బరిలోకి దిగనుంది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.ఇది భారత్‌కు ప్లస్ పాయింట్ కావచ్చు.

Team India, New Zealand Test Series Starts Today .. Which Team Is Strong Team In
Advertisement

న్యూజిలాండ్ విషయానికొస్తే.ఈ జట్టు గత కొంత కాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తోంది.లేటెస్ట్ టీ20 సిరీస్‌లో ఇండియా చేతిలో వైట్‌వాష్‌ అయినా.

న్యూజిలాండ్ ని తక్కువ అంచనా వేయకూడదు.ఆ టీ20 సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఆడలేదు.

కానీ ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో మాత్రం అతడు బరిలోకి దిగనున్నాడు.మిడిలార్డర్‌లో దిగనున్న విలియమ్సన్‌ను త్వరగా ఔట్ చేస్తే.

భారత్‌కు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.కేన్ విలియమ్సన్‌తో పాటు టామ్ లాథమ్‌ కూడా మంచి జోరుమీద ఉన్నాడు.

ఇతడు కూడా భారత బౌలర్లను ఉతికారేసే అవకాశాలు ఎక్కువ.ఓపెనర్లుగా బ్యాటర్ టామ్ లాథమ్‌, డెరిల్ మిచెల్‌ దిగే అవకాశం ఉంది.

మిచెల్‌ శాంట్నర్‌, అజాజ్‌ పటేల్‌, జెమీసన్, నీల్ వాగ్నర్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), టిమ్ సోధి వంటి టాలెంటెడ్ ప్లేయర్లతో కివీస్‌ ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆడనుంది.

తాజా వార్తలు