“భవిష్యత్తుకు” గ్యారంటీ అధికారాన్ని తీసుకొస్తుందా?

రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహానాడు కార్యక్రమంలో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మొదటి మేనిఫెస్టో ( Tdp manifesto )తెలుగుదేశం భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది.మహానాడు వేదికగా ఎన్నికల హామీలు ప్రకటించిన చంద్రబాబు ( Chandrababu Naidu )తెలుగుదేశానికి అనుకూలమైన వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం లో విజయవంతం అయ్యారని తెలుస్తుంది.

 Tdp Will Get Benifit From This Announced Schemes In Mahanadu, Mahanadu, Tdp, 202-TeluguStop.com

వచ్చే ఎన్నికలకు ముందు జరుగుతున్న ఆఖరి మహానాడు కార్యక్రమం కావడంతో ప్రజలకు ఇవ్వాల్సిన సంకేతాలను ఇవ్వడానికి ఈ వేదికను ఉపయోగించుకున్న చంద్రబాబు తన వరాల జల్లు ద్వారా ప్రజలు నాకట్టుకునే ప్రయత్నం చేశారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన పాత్ర వహించిన అ హామీలే ఆంధ్రదేశంలో కూడా తనకు విజయాన్ని తీసుకొస్తాయని ఆయన నమ్ముతున్నారు.దాంతో అక్కడ ప్రజలపై ప్రభావం చూపించిన పథకాలను అధ్యయనం చేసిన తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక కమిటీ ,మెజారిటీ వర్గాలను కవర్ చేసేలాగా హామీలను రూపొందించినట్లుగా తెలుస్తుంది.

అంతేకాకుండా నగదు బదిలీ పథకం జగన్కు మంచి ఫలితాలు సాధించి పెట్టిందని , గత ఎన్నికల్లో జగన్ గెలుపుకు ( YS Jagan Mohan Reddy )కీలకపాత్ర వహించిందని గుర్తించిన తెలుగుదేశం పార్టీ వర్గాలు వాటిని తిప్పుకొట్టే పథకాలుగా నగదు బదలీనే తీసుకొచ్చారు.

Telugu Ap, Chandrababu, Mahanadu, Rajamundry, Tdp Manifesto, Ysjagan-Telugu Poli

రైతులని మహిళలను ఆకట్టుకునేలా రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తామని, అమ్మకు వందనం పథకం కింద ప్రతి మహిళకు 15000 ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు అకౌంట్ లో జమ చేస్తామని నగదు బదిలీ పథకాలను ప్రకటించారు .అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగు బృతి కింద నెలకు 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం ద్వారా మెజారిటీ వర్గాలకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది .

Telugu Ap, Chandrababu, Mahanadu, Rajamundry, Tdp Manifesto, Ysjagan-Telugu Poli

అయితే నగదు బదిలీ పథకాల ద్వారా రాష్ట్రాన్ని అదో గతి పాలు చేశారని విమర్శించిన తెలుగుదేశం పార్టీ మరొక సారి అలాంటి హామీలు ఇవ్వటం దేనికి సంకేతమంటూ విమర్శలు వస్తున్నాయి .అయిన విజయ మాత్రమే మాట్లాడే ఎన్నికల ఆట లో నీతి నియమాల గురించి నైతికత గురుంచి పట్టించుకునే తీరిక రాజ కీయ పార్టీలకు లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube