ఏపీలో పార్టీల మధ్య పొత్తుల ఎత్తులు చిత్ర విచిత్రంగా ఉన్నాయి.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ రాజకీయ రణరంగంలో పై చేయి సాధించేందుకు పావులు కదుపుతున్నాయి.
ఇక ఏపీలో అధికార పార్టీ టీడీపీ విషయానికి వస్తే… ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల బరిలోకి ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.కానీ ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తే ఫలితం ఎలా ఉంటుందో బాబుకి బాగా తెలుసు అందుకే టీడీపీకి ఆగర్భ విరోధి అయిన కాంగ్రెస్ తో జత కట్టేందుకు ఆ పార్టీ తహతహలాడుతోంది.
అయితే ఈ పొత్తు పై జనం నాడి తెలుసుకున్నాకే ముందుకు వెళ్లాలని టీడీపీ భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపే పనిలో పడ్డారు.
ఏపీని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో దోస్తీ కట్టడాన్ని ప్రజలు ఒప్పుకుంటారా .? లేదా? ఈ నిర్ణయం వచ్చే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చూపుతుంది? అనే సందేహాలు ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతల్లోనూ ఉన్నాయి.అందుకే పొత్తుపై ముందుకెళ్లాలా వద్దా అనే అంశంపై ఒక సర్వే నిర్వహించాలని చంద్రబాబు నిర్నయాయం తీసుకుని సర్వేకు పచ్చ జెండా ఊపాడు.కానీ … ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి తీవ్ర అన్యాయం చేసిందననే ప్రచారం గత ఎన్నికల్లో టీడీపీకి బాగా కలిసొచ్చింది.ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి ఆ పార్టీకి ఏపీలో స్థానం లేకుండా చేశారు చంద్రబాబు!

ఇప్పుడు అదే కాంగ్రెస్ ఏపీకి న్యాయం చేస్తామని చెబుతోంది.ఏపీకి హోదా ఇస్తామని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న టీడీపీ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోంది.పార్లమెంటు సమావేశాల తర్వాత.దీనిపై మరింత స్పష్టత కనిపిస్తోంది.తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదు.
కానీ ఏపీలో పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా జరిగింది.
ఈ నేపథ్యంలో రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా ? పొత్తు లాభమా ? నష్టమా అన్న అంశాలపై టీడీపీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చే పనిలో పడింది.దీనికి సంబంధించి ఓ సర్వే కూడా జరుపుతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన క్లారిటీ వచ్చేసిందట.ఫైనల్ గా సర్వే ఫలితాల ఆధారంగా అధికారకంగా పొత్తుపై మాట్లాడితే బాగుంటుందనేది టీడీపీ అధినేత ఆలోచన.







