కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.ఈ క్రమంలో స్థానిక నాయకుల మధ్య విభేదాలు తొలగించేందుకు పార్టీ హైకమాండ్ సమాయత్తం అయినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఈనెల 13 వ తేదీన గుడివాడలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అందరూ కలిసి పని చేయాలని పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు గుడివాడ పర్యటన ఏర్పాట్లపై అచ్చెన్నాయుడు ఆరా తీశారు.







