ఏపీలో విపక్షాలు, వ్యతిరేక మీడియా ఎప్పుడు ఏదో రకంగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి.ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతరేకత పెరిగిందని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రచారం చేస్తూ ఉంటాయి.
ఏదో ఒక అంశం తో జగన్ పేరును తెరపైకి తెస్తూ జనాల్లో ఆయన పరపతిని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే వస్తున్నాయి.అయితే ఇవేవి జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
విపక్షాలు, ఒక వర్గం మీడియా ఎప్పుడు తనపై ఇదే విధమైన ప్రచారం చేస్తుంటాయని , వాటిని పట్టించుకోనవసరం లేదు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తూ వస్తున్నారు.
మళ్లీ అధికారం లోకి వస్తామన్న నమ్మకాన్ని జగన్ వ్యక్తం చేయడానికి వెనుక ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త అండదండలు ఉండడమే.వైసీపీని 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన ఘనత ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ కు దక్కుతుంది.2024 ఎన్నికల్లో ను మళ్లీ వైసీపీ విజయం వైపు తీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఈ మేరకు ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీమ్ ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యింది.ఏపీ లోని మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించి వైసిపి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి ? ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి ? సంతృప్తి ఎంత అసంతృప్తి ఎంత అనే విషయాలపై సమగ్ర సర్వే నిర్వహించబోతోంది.దాని ఆధారంగానే బలం పెంచుకునేందుకు ఏం చేయాలనే విషయాలపైన తగిన సూచనలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.
ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏపీలో అడుగుపెడితే తమకు ఎటువంటి పరిస్థితులు వస్తాయనే ఆందోళన వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల్లో ఉంది.అందుకే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ తో పాటు, టీడీపీఅనుకూల మీడియా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టింది.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలిశారు.
ఈ సందర్భంగా జగన్ చిరంజీవి కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారు అంటూ కొన్ని చానల్స్ లో ప్రచారం జరగడం , అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వైరల్ అయ్యింది.దీంతో ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమేనంటూ ఆ కథనాలు ఉండడం, ఆ తరువాత రాజకీయాలలో కి వెళ్లాలనే ఆసక్తి లేదని, తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అంటూ స్వయంగా చిరంజీవి ప్రకటించారు.
ప్రశాంత్ కిషోర్ కనుక ఏపీ లో అడుగు పెడితే కులాలను, మతాలను చీల్చే విధంగా ఆయన కుట్రలు పన్నుతారని ఓ వర్గం మీడియా ప్రచారం మొదలు పెట్టడం, అటువంటి వ్యక్తిని జగన్ తన రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారని విశ్లేషణలు చేస్తుండడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ వ్యతిరేక మీడియా లో ఇదే రకమైన కథనాలు వచ్చాయి చంద్రబాబు వంటి రాజకీయ అనుభవజ్ఞుడైన వ్యక్తిని ఎదుర్కోవడం ప్రశాంత్ కిషోర్ వల్ల సాధ్యం కాదని , బీహార్ రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు చాలా తేడా ఉందని , అక్కడ రాజకీయం ఇక్కడ చెల్లుబాటు కాదు అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.అయినా, 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు విజయం నిలబడింది.ఇక ఇప్పుడూ అదే రకమైన ప్రచారం మరోసారి మొదలయ్యింది.