చినబాబు చుట్టూ తిరుగుతున్న టీడీపీ రాజకీయాలు

టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించిన మహానాడు కార్యక్రమం ముగిసింది.రెండు రోజుల పాటు సాగిన మహానాడు టీడీపీలో ఉత్సాహాన్ని నింపింది.

 Tdp Politics Revolving Around Nara Lokesh Details, Telugu Desam Party, Nara Loke-TeluguStop.com

అయితే కొన్ని అంశాలపై క్లారిటీ కూడా ఇచ్చింది.ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలతో పాటు యంగ్ లీడర్లు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.

నిజంగా చెప్పాలంటే సీనియర్ లీడర్ల కంటే యంగ్ లీడర్లకే టీడీపీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది.

సాధారణంగా టీడీపీ నేతలు ఏ అంశంపై చర్చించాలన్నా ముందుగా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తుంటారు.

కానీ మహానాడులో టీడీపీ రాజకీయాలు చంద్రబాబు తనయుడు లోకేష్ చుట్టూనే జరిగాయి.శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తలలు పండిన నేతలందరూ ఈసారి లోకేష్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు.

తమ ప్రసంగాల్లో కూడా చంద్రబాబు కంటే లోకేష్ గురించి మాట్లాడేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రత్యేకంగా లోకేష్‌తో సమావేశమై తన నియోజకవర్గంలో చేస్తున్న కృషి గురించి వివరించారు.

ఇతర సీనియర్ లీడర్లు కూడా తమ వారసులను లోకేష్‌ దగ్గరకు పంపి ఆయన మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Mlagundamma, Mahanadu, Lokesh, Tdp Mahanadu,

ఈ నేపథ్యంలో మహానాడు తొలిరోజే లోకేష్ పార్టీ సీనియర్లకు హెచ్చరికలు పంపారు.టీడీపీలో ఏం జరిగినా కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పుకోవడానికే లోకేష్ ఓ స్టేట్‌మెంట్ చేశారనే ప్రచారం జరుగుతోంది.

పార్టీని బలోపేతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని లోకేష్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.

అందుకే వచ్చే ఎన్నికల్లో పార్టీలో సీనియర్లకు టికెట్లు తగ్గుతాయని లోకేష్ స్పష్టం చేశారు.మూడుసార్లు వరుసగా ఓడిపోయిన వారికి, పార్టీలో పనిచేయని వారిని కూడా తప్పిస్తామని లోకేష్ వ్యాఖ్యానించడంతో టీడీపీ సీనియర్లు ఆందోళన పడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితిపై బేరీజులు వేసుకుంటున్నారు.వారసులు ఉన్న సంగతి అటుంచితే లేని వాళ్ల పరిస్థితి ఏంటా అని ఆలోచన చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube