అందరూ ఊహించినట్టుగానే తెలంగాణ ఎన్నికలలో టిడిపి( TDP ) చేతులెత్తేసింది .ఆ మేరకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో పోటీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu ) విముఖత వ్యక్తం చేశారని ,రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలంటే తెలంగాణలో పోటీ చేయకూడదని ప్రాథమికంగా నిర్ణయించినందున పోటీ నుంచి విరమించుకున్నట్లుగా ప్రకటించారు.
ఆ తదనంతర పరిణామాలలో ఆయన కూడా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.దాంతో తెలంగాణ రాజకీయాల్లో( Telangana politics ) ఒక శకం ముగిసినట్లుగానే భావించాలి .నిజానికి ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశానికి వేల సంఖ్యలో ఓటు బ్యాంకు ఉంది.ముఖ్యంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశానికి తెలంగాణ నుంచి అనేకమంది వెనకబడిన వర్గాల నుంచి మధ్యతరగతి సమాజం నుంచి ఉత్సాహం గల యువకులు నాయకులుగా ఎన్నికయ్యారు.

అలా తెలంగాణ సమాజంలో అధికారాన్ని అన్ని వర్గాలకు దగ్గర చేసిన పార్టీగా తెలుగుదేశానికి పేరు ఉంది.తర్వాత పార్టీని చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు కూడా బీసీలకు వెనుక బడిన సామాజిక వర్గాలకు బాగానే అవకాశాలు ఇచ్చారు.అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాంతీయ భావన బలం గా ప్రబలటం తెలుగుదేశానికి పూర్తిస్థాయి ఆంధ్ర ముద్ర పడటం, కేసీఆర్ అండ్ కొ ఈ విషయంలో భారీ ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు దేశాన్ని బయట పార్టీ గా చాలామంది తెలంగాణ ప్రజలకు భావించారు.దాంతో 2018 లో జరిగిన ఎన్నికల లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయిన తెలంగాణ టిడిపి , ఆ తదనంతర పరిణామాలతో ఆ ఇద్దరు కూడా పార్టీకి దూరం అయ్యిపోవడం తో తన ఉనికిని నిలబెట్టుకోవడం ఈ పార్టీకి కష్టమైపోయింది.

ప్రస్తుత ఎన్నికలు చాలా హోరాహోరీగా జరుగుతాయని, ప్రధానంగా కాంగ్రెస్ బిఆర్ యస్( Congress ,BRS ) మధ్యనే పోటీ జరుగుతూ ఉంటాయన్న అంచనాలతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న వ్యూహ నిపుణుల సూచన మేరకే చంద్రబాబు వెనకడుగు వేసినట్లుగా తెలుస్తుంది.అయితే తెలుగుదేశం విరమించుకోవడం వల్ల ఏ పార్టీకి అంతిమంగా మేలు జరుగుతుందన్న విషయం మీద అనేకమంది రాజకీయ పరిశీలకులు అనేక విశ్లేషణలు కూడా చేస్తున్నారు.ఇది అంతిమంగా కాంగ్రెస్కు ఎక్కువ లాభం చేకూరుస్తుంది అన్నది మెజారిటీ విశ్లేషకులు భావన.ఏది ఏమైనా ఒకప్పుడు తెలంగాణను గుత్తాధిపత్యంతో పరిపాలించిన పార్టీ ఇప్పుడు పూర్తిస్థాయిలో కనుమరుగైపోవడం మాత్రం విధి విచిత్రమనే చెప్పాలి .







