తమిళనాడులో జల్లికట్టుపై కేంద్రం విధించిన నిషేధం ఎత్తివేసేందుకు తమిళ యువత చేసిన ఉద్యమ స్ఫూర్తిని ఏపీ ప్రజల్లో ఒక్కసారిగా ప్రత్యేక హోదా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది.ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు యువత ఒక్కసారిగా కదిలింది.
తమకు ఫ్యూచర్ ఉండాలంటే హోదా రావాల్సిందే అంటూ నినందించింది.ఈ క్రమంలో వీరికి ఏపీలోని ప్రధాన విపక్షం వైసీపీ.
పవన్ జనసేనతో పాటు మిగిలిన అన్ని పార్టీలు తోడయ్యాయి.
రిపబ్లిక్ డే రోజున విశాఖకు అందరూ తరలివెళ్లారు.
హోదా కోసం ఇంత ఉధృతంగా జరుగుతోన్న ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.హోదాకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో…వారందరిని టార్గెట్‌గా చేసుకుంటూ ఈ నెగిటివ్ ప్రచారం జోరందుకుంది.
ఏపీకి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ఉపయోగం ఏం ఉండదని.ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తే చాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నవారు చెపుతున్నారు.
హోదాకోసం జరుగుతోన్న ఉద్యమాన్ని నీరుగార్చడం వెనక ఎవరెవరు ఉన్నారా ? అన్న అంశంపై ఏపీ మీడియా & పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.ఈ నెగిటివ్ ప్రచారం వెనక అధికార పార్టీలోని కొందరు పని చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఆ పార్టీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో ఈ నెగిటివ్ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు.ఇప్పుడు హోదా కోసం ఫైటింగ్ చేస్తే ఏపీ అభివృద్ధి కుటుంపడుతుందని…ఏపీకి వచ్చే పెట్టబడులు అన్ని వెనక్కి వెళ్లిపోతాయని వారంటున్నారు.
జల్లికట్టు స్ఫూర్తితో అందరూ ఒక్కతాటిమీదకు వచ్చి ఉద్యమిస్తోన్న వేళ ఇలా నెగిటివ్ ప్రచారం చేయడంపై సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.మరి దీనికి అధికార పార్టీ ఏమని సమాధానం చెప్పుకుంటుందో చూడాలి.








