బాబు పై పంచకర్ల ఆరోపణలు,పార్టీ నుంచి మరింతమంది జంప్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తన అనుచరులతో కలిసి ఈ రోజు(శుక్రవారం) సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ లో చేరారు.

పార్టీ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ కార్యక్రమంలో పంచకర్ల కు వైసీపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి,అలానే మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో పంచకర్ల మాట్లాడుతూ టీడీపీ అధినేత,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని తనకు సంబంధించిన మనుషులే అభివృద్ధి చెందాలి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ ఆయన విమర్శించారు.

TDP Ex-MLA Panchakarla Ramesh Babu Criticise Chandrababu, TDP, Panchakarla Rames

అంతేకాకుండా అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని తమను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, పార్టీ విధానాలు నచ్చకే 5 నెలల క్రితమే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు.అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరం స్వాగతిస్తున్నాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా త్వరలోనే టీడీపీ లో ఉన్న మరికొంతమంది కీలక నేతలు కూడా వైసీపీ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.ఇప్పటికే టీడీపీ కి చెందిన పలువురు నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన విషయం విదితమే.

Advertisement

అయితే ఇప్పుడు తాజాగా పంచకర్ల కూడా వైసీపీ కండువా కప్పుకోవడమే కాకుండా మరికొంత మంది కూడా ఇదే బాటలో అడుగులు వేయనున్నట్లు తెలపడం గమనార్హం.మరి ఏపీ రాజకీయాల్లో టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది ప్రస్నార్ధకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు