టీటీడీ బోర్డుపై నిప్పులు చెరుగుతున్న టీడీపీ ?

క‌లియుగ వైకుంఠం తిరుమ‌ల‌కు వెళ్లాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) అనుస‌రిస్తున్న విధానాలు, తీసు కుంటున్న నిర్ణ‌యాల ప‌ట్ల టీడీపీ మండి ప‌డుతోంది.

శ్రీవారి భ‌క్తుల మ‌నోభావాల దెబ్బ‌తీసేలా టీటీడీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తోంది.తిరుమ‌ల‌త ప్రాభ‌వం త‌గ్గించేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమ‌ల‌ను వ్యాపార కేంద్రంగా చేస్తున్నార‌ని టీడీపీ నేత , ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావులు కేశ‌వ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టికెట్ లేకుంటే తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు పంపించ‌ట్లేద‌ని, తిరుమ‌ల‌లో క‌రోనా ఆంక్ష‌ల‌పై బీజేపీ మౌనం ఎందుకంటూ ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించాడు.దేశంలో ఏ ఆల‌యంలో లేని క‌రోనా ఆంక్ష‌లు తిరుమ‌ల‌లో ఎందుక‌ని నిల‌దీశాడు.

వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఆల‌యాలు క‌ట్ట‌వ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు.జిలేబీ ప్ర‌సాదం రూ.2వేలు చేసి సామాన్యుల‌కు అంద‌ కుండా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.తిరుమ‌ల భ‌ద్ర‌త‌ను క‌మిటీ నివేద‌క‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేస్తుంది.

Advertisement

ఇక టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ కూడా టీటీడీ నిర్వాకంపై మండిప‌డ్డారు.టీటీడీ ధార్మిక మండ‌లిని జ‌గ‌న్ దోపిడీ మండ‌లిగా మార్చాడంటూ విరుచుకుప‌డుతున్నారు.శ్రీవారి సేవా టికెట్ల‌ను టీటీడీ సభ్యులే వాటాలు వేసుకుంటున్న‌ట్టు ఆరోపించారు.

క్రిమిన‌ల్ కేసులు ఉన్న ప‌ద‌హారు మందిని టీటీడీ బోర్డు స‌భ్యులుగా నియ‌మించు కుంద‌ని ఆరోపించారు.అలాగే టీటీడీ బోర్డు చైర్మ‌న్‌, వైసీపీ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌ణీయాంశంగా మారాయి.రూ.400 ఉన్న సుప్ర‌భాత సేవ‌ను రూ.800 చేయాల‌నే ప్ర‌తిపాధ‌నకు ఆయ‌న మీడియా ముందే రూ.2వేలు చేసేయండి ? ఏమ‌వుతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.అలాగే తోమాల సేవ ఇప్ప‌టికే రూ.2వేలు ఉండ‌గా మ‌రో రూ.500 పెంచేయండంటూ నిర్ల‌క్ష్యంగా మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.తిరుమ‌ల భక్తులు సైతం ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు.

భారాలు మోప‌డ‌మేంట‌ని ఆవేద‌న వెలిబుచ్చుతున్నారు.రానురాను టీటీడీ నిర్ణ‌యాలు దేనికి దారి తీస్తాయో వేచి చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement
" autoplay>

తాజా వార్తలు