ఏపీ అధికార ప్రతి వైసిపి( YCP ) కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.ఇటీవల జరిగిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను వైసిపి కోల్పోవడం పెద్ద షాకే ఇచ్చింది.
ఇప్పుడు మరోసారి అటువంటి జలక్ అధికార పార్టీకి తగిలింది.కచ్చితంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని భావిస్తున్న వైసీపీ కి ఊహించిన విధంగా టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడం మింగుడు పడడం లేదు.
టిడిపికి 19 ఓట్లు ఉండగా, ఈరోజు జరిగిన ఎన్నికల్లో 23 ఓట్లు వచ్చాయి .ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే 22 ఓట్లు సరిపోతాయి . వాస్తవంగా 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.అలాగే జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు.
దీంతో 19 ఓట్లు మాత్రమే టిడిపికి ఉన్నాయి.

ఇటీవల వైసిపి పై తిరుగుబాటు ఎగరవేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kotam Reddy Sridhar Reddy ) , ఆనం రామనారాయణ రెడ్డి( Ramanarayana Reddy ) టిడిపికి అనుకూలంగా ఓటు వేసినా, టిడిపికి 21 ఓట్లు మాత్రమే రావాలి.23 ఓట్లు రావడంతో పంచుమర్తి అనురాధ గెలుపొందారు.వైసిపి 151 స్థానాల్లో గెలిచింది.
టిడిపి నుంచి వచ్చిన నలుగురి తోపాటు , జనసేన( Janasena ) ఎమ్మెల్యే మద్దతు కలుపుకుంటే 1506 ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయి.ఈ విధంగా చూసుకుంటే వైసీపీకి 7 ఎమ్మెల్సీ స్థానాలు దక్కాల్సి ఉన్నా.
ఒక స్థానంలో ఓటమి చెందింది.వైసిపి నుంచి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయంపై వైసీపీ అధిష్టానం ఆరా తీయగా, ఆ ఇద్దరిలో ఒకరు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మరొకరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని వైసిపి అనుమానిస్తోంది.

దీనికి కారణం వారిద్దరికీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు రావని ప్రచారం జరగడంతో పాటు, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాలకు సమన్వయకర్తల ను నియమించారు.దీంతో వారిద్దరే క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా వైసిపి అనుమానిస్తుంది .దీంతో వారిద్దరిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.