ప.గో:జిల్లా పాలకొల్లు (మం) సగం చెరువు లో బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది.రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రభుత్వ వైపు ముదునూరి ప్రసాద్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పాల్గొనేందుకు వీలులేదని పోలీసులు అభ్యంతరం పెట్టారు.
బ్రిడ్జి నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు నిధులు తెచ్చిన
తనను ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్ళనివ్వరంటూ ఎమ్మెల్యే రామానాయుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.శిలాఫలకం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై ఎమ్మెల్యే రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకు ఫ్రోటకాల్ ఉంది నన్నెందుకు వదలరంటూ విదిలించుకుని ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంలోనే వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.