ఏపీ రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు.ఎలాంటి కామెంట్లైనా చేయొచ్చని భావించే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకున్న విషయం విధితమే.ఇక యూపీలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికార పీఠం దక్కించుకుంది.
అయితే ఏపీ టీడపీ నేతలు మాత్రం వైసీపీ, సీఎం జగన్పై తెగ విరుచుకుపడడం చర్చకు దారి తీస్తోంది.అక్కడ బీజేపీ విజయంతో ఇక్క జగన్కు భయం పట్టుకుందంటూ కొందరు టీడీపీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక కేంద్రం ముందు జగన్ ఆటలు సాగవంటూ ఎద్దేవా చేస్తున్నారు.
అయితే ఉత్తరాది ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంటే ఏపీలో జగన్కు ఏంటీ సమస్య అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది.
ఎందుకంటే ఏపీలో వైసీపీ సీఎం జగన్ బలంగా ఉండాలనేది బీజేపీ భావన.ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జగన్ సాయం చేస్తూ వచ్చారు.
కేంద్ర చట్టాలకు మద్దతు ఇస్తూ వచ్చారు.రాజ్య సభ సీట్లను కూడా ఇస్తున్నారు.
ఎప్పుడైనా కేంద్ర మంత్రులు ఏపీకొస్తే విందు కూడా ఇస్తున్నారు.ఇక జగన్కు ఇబ్బందులేంటీ ? ఏపీలో బీజేపీ పుంజుకున్న దాఖలాలు లేవు.కాగా టీడీపీ నేతలే గతంలో మోడీని విమర్శించిన విషయం విధితమే.

ఏకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు.అప్పటి నుంచి టీడీపీని బీజేపీ దూరం పెడుతూ వస్తోంది.వీటిని చక్కదిద్దుకుని ముందుకు సాగాల్సింది పోయి విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం.
ఆగ్రహావేశాలతో జగన్పై నోరు పారేసుకోవడం లాంటివి చేస్తే ఏమి ప్రయోజనం చేకూరదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.భవిష్యత్లో ఇలాంటి అవకాశాలు కూడా రావని కితాబిస్తున్నారు.మరి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు ? టీడీపీ నేతల విమర్శలకు సీఎం జగన్ ఎలాంటి సమాధానాలు చెబుతాడో వేచి చూడాల్సిందే.