అన్నమయ్య జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి శ్రేణులపై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి మాజీ మంత్రి పొంగూరి నారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఖండించారు.నెల్లూర నగర నియోజకవర్గం మైపాడు గేటు సెంటర్ వద్ద రికార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం వ్యవస్థ కలిగిన ఏకైక దేశం భారతదేశం.
ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం దురదృష్టకరం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై రాళ్లదాడి చేయడం హేయమైన చర్యగా అభివందించారు.భావ ప్రకటన స్వేచ్ఛను కూడా వైసిపి హారిస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.2024లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







