జగన్ కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే విషయం ఏంటంటే?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీడిపి వర్సెస్ వైసీపి ఫైట్ తీవ్రంగా జరగుతుంది.

ముఖ్యంగా రాజధాని అంశంలో అయితే ఈ ఫైట్ తీవ్ర రూపం దాల్చింది.

అగ్రనాయకుల నుండి కార్యకర్తల దాకా పగలు, రాత్రి అని తేడా లేకుండా మీడియా ముందు మీరు చేసిందే తప్పు అంటూ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.ఇలాంటి టైంలో విశాఖపట్నం టీడిపి ఎమ్మెల్యే సీఎం జగన్ కు రాసిన లేక రాజకీయ పక్షాలలో పెద్ద కలకలం రేపుతుంది.

Tdp Leader Written A Letter To Ycp, TDP, YSRCP, Jagan, Vishakapatanam, Gana Babu

ఇంతకీ ఆ లేఖేంటో అందులో ఉన్న విషయమేంటో ఇప్పుడు చూద్దాం.విశాఖపట్నం ఆగనంపూడి ప్రాంతంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 80 ఎకరాల స్థలం గతంలో కేటాయించారు.

దాన్ని రద్దు చేస్తూ తాజాగా వైసీపి సర్కార్ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఆదివారం నాడు సీఎం జగన్‌కు లేఖ రాశారు.

Advertisement

ఇందులో తన ముందు స్పోర్ట్స్‌మెన్‌ అని ఆతరువాతే ప్రజా ప్రతినిధిని పేర్కొన్నారు.ఇక మానవ జీవన విధానంలో ఎంతో ముఖ్యమైన క్రీడల కు సంబంధించి కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవడం తగదని కావున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించాలని కోరారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు