వైసిపి, టీడీపీ, జనసేన, బిజెపి ఈ నాలుగు పార్టీల మధ్య ఇప్పుడు అమరావతి, మూడు రాజధానుల వ్యవహారంపై విమర్శలు , ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసిపి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, దానిని వ్యతిరేకిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అంటూ వైసిపి పై మిగిలిన మూడు పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు.
అంతే కాదు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహా పాదయాత్రను నిర్వహిస్తున్నారు.ఇక నిన్న విశాఖ కేంద్రంగా జనసేన , టిడిపి, వైసిపి ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర చర్చ వేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని, జగన్ తో పాటు వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మద్దతు తెలిపారని , కానీ ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడు ఈ తుగ్లక్ నా కొడుకు అంటూ అయ్యన్న మండిపడ్డారు.విశాఖలో రామానాయుడు స్టూడియో జగన్ లాగేసుకున్నారని , తమను బెదిరించి రాయించుకున్నారని సురేష్ బాబు చెప్పారు అంటూ అయ్యన్న సంచలన విమర్శలు చేశారు.
మనం నవ్వుతూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు.ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటాడు ఈ శాడిస్ట్ నా కొడుకు అంటూ జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.మిగతా వైసిపి నేతలంటే పిల్ల నా కొడుకులు అంటూ వ్యాఖ్యానించారు.మంత్రులు బొత్స, ధర్మాన ప్రసాద్ రావు లకు ఏమైంది ? ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు వారిద్దరు ఎందుకు మాట్లాడుతున్నారో అంటూ ఆయన ప్రశ్నించారు. సీనియర్లుగా మీకు బాధ్యత లేదా అంటూ అయ్యన్న ప్రశ్నించారు.

ఇక చోడవరం వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ఉద్దేశించి విమర్శలు చేశారు.చోడవరం ఎమ్మెల్యే బుడబుక్కల గాడు రాజీనామా చేస్తాడట, మరి స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు రాజీనామా చేయలేదు అంటూ అయ్యన్న ప్రశ్నించారు.ఈరోజు అసెంబ్లీలో అమరావతికి మద్దతు పలికిన ఓ మూర్ఖుడా ఇప్పుడు మూడు రాజధానులు అంటావేంట్రా అంటూ జగన్ పై సంచలన విమర్శలు చేశారు.
జగన్ కు ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం తప్ప పరిపాలన అనుభవం లేదన్నారు.రాజధాని, ఆర్థిక రాజధాని వేరు అని, దేశానికి ఢిల్లీ రాజధాని ముంబై ఆర్థిక రాజధాని, అలాగే విశాఖపట్నం కూడా ఆర్థిక రాజధాని అని అన్నారు .అమరావతి ఎమ్మెల్యేలు పాదయాత్రకు తోటి రైతులుగా మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని, వారి యాత్ర నర్సీపట్నంలో జరిగినప్పుడు తాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, మిగిలిన వారు కూడా సహకారం అందించాలని అయ్యన్న కోరారు .







