ఏపీలో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన( TDP, Janasena ) పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొలిక్కి రావడం లేదు.జనసేన సీట్లను కోరిన నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి, భీమిలితో పాటు అనకాపల్లిలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంచాయతీ నడుస్తోంది.ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ ఆశావహుల మధ్య హోరా హోరీ పోరు నెలకొంది.

విశాఖ సౌత్ సీటు కోసం గండి బాబ్జీ, వంశీకృష్ణ మధ్య పోటీ నెలకొనగా.భీమిలి సీటు కోసం వంశీకృష్ణ, పంచకర్ల సందీప్ మరియు గంటా మధ్య తీవ్రమైన పోటీ ఉంది.గాజువాక సీటు కోసం సతీశ్ కుమార్, విజయ్ కుమార్, పల్లా శ్రీనివాసరావు మధ్య పోటీ ఉండగా.టీడీపీ నుంచి పెందుర్తి నియోజకవర్గ బరిలో బండారు సత్యనారాయణ( Bandaru Satyanarayana ) పోటీ చేస్తానని చెబుతున్నారని తెలుస్తోంది.
అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల( Konathala Ramakrishna ) పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.మరోవైపు టీడీపీ నేత గోవింద్ సైతం అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని భీష్మించుకుని ఉన్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో టీడీపీ -జనసేన సీట్ల పంచాయతీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.







