స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భారీగా అవినీతికి పాల్పడినందుకే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ను కనీసం టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు.
టీడీపీ రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తోందని మంత్రి కాకాణి పేర్కొన్నారు.గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి చంద్రబాబన్న సంగతి ఆయన గుర్తు చేశారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రం అప్పులమయంగా మారిందని ఆరోపించారు.టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న మంత్రి కాకాణి రానున్న ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







