ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ వాతావరణం తమకు అనుకూలం గా మారుతున్నపటికి ,తెలుగుదేశం ( TDP ) ఇప్పుడు సందిగ్ధవస్థ ఉంది అని వార్తలు వస్తున్నాయి .కూడలి మధ్యలో నిలబడి సరైన దారి కోసం వెతుక్కుంటున్నట్లుగా ఉందని విశ్లేషణలు వస్తున్నాయి .
ఇంతకాలం ఆ పార్టీ బిజెపితో ( BJP ) కలిసి నడవాలని కోరుకున్నప్పటికీ పరిస్థితిలు అనుకూలించలేదు.అంతేకాకుండా టీడీపీకి కూడా గ్రౌండ్ లెవెల్ లో అంత ఆదరణ దక్కలేదు .అయితే క్రమంగా పరిస్థితులు తెలుగుదేశం అనుకూలంగా మారటం, జనసేన ( Janasena ) తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని బహిరంగంగా ప్రకటించడంతో ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశానికి అనుకూల వాతావరణ ఏర్పడింది, వచ్చే ఎన్నికల్లో గెలిచేది కచ్చితంగా తెలుగుదేశం పార్టీనే అని చంద్రబాబు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారనే భావన క్రమంగా ప్రజలలో బలపడుతుంది .దాంతో ఆ పార్టీ కాడర్ లో జోష్ వచ్చింది .

ఆ పార్టీ కార్యక్రమాలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి .ఇలాంటి సమయంలో పొత్తుల పేరిట సీట్లను త్యాగం చేయాల్సిన వాతావరణం తెలుగు తమ్ములను ఇబ్బంది పెడుతుందట.ఇప్పటికే జనసేన పార్టీ 50 వరకు సీట్లు ఆశిస్తుందని అంచనాలు ఉండగా, ఇప్పుడు బిజెపితో పొత్తుతో మరో 15 నుంచి 20 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తాము మ్యాజిక్ ఫిగర్ కు ఎలా చేరుకుంటామని ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది.పొత్తులపై ఆధారపడటం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారట .అయితే ప్రతికార రాజకీయాలకు తెర తీసిన బలమైన ప్రత్యర్థి అయిన జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలంటే అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదలకూడదని భావిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో పొత్తులు తప్పనిసరి అని భావించడంతో,

ఈ త్యాగాలతో తాము ఎన్ని సీట్లు కోల్పోతామో అన్న ఆందోళనలో తెలుగుదేశం లో ఉన్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ,వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం లాంటి అంశాలతో తెలుగు ప్రజల్లో వ్యతిరేకత మూట గట్టుకున్న భాజాపా పార్టీ తో కలిసి నడిస్తే ఆ ప్రభావం తమ పైన కూడా పడుతుందనె ఆందోళనలో తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారట.అయితే కేంద్రం నుంచి అనేక అవసరాలు ఉన్న నేపథ్యంలో కలిసి నడవకపోతే భవిష్యత్తులో ఎదుర్కొనే పరిణామాల పట్ల కూడా పార్టీలో చేర్చ జరుగుతుందని తెలుస్తుంది .ఎలా చూసినా కూడా బిజెపితో పొత్తు ఓట్ల పరంగా ఏ రకంగానూ కలిసి రాకపోయినప్పటికీ అనేక రాజకీయ సమీకరణాల ను ఎదుర్కోవడానికి మాత్రం బలమైన కేంద్ర ప్రభుత్వ అండ కావాలి కాబట్టి కలిసి నడవాలని నిర్ణయంతోనే చంద్రబాబు ఉన్నట్లుగా చెబుతున్నారు
.