సినిమా చూపించిన బాబు: టీడీఎల్పీ సమావేశంలో నవ్వులే నవ్వులు

శాసనమండలిని ఏపీ సీఎం జగన్ రద్దు చేయబోతున్నారని వార్తలు నేపథ్యంలో టీడీపీ శ్రేణుల ఆందోళన ఉన్నాయి.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తమ పదవులు అర్థంతరంగా ఉన్నాయని ఆందోళన లో ఉన్నాయి.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు టిడిపి ఎమ్మెల్సీలకు రకరకాల ఆఫర్ లు ఇస్తూ వారిని తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అనే వార్తలు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి.తమ ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి ఐదు కోట్ల చొప్పున ఇచ్చి వైసీపీ ప్రభుత్వం వారిని తమ పార్టీకి దూరం చేయాలని ప్రయత్నిస్తుందని వార్తలు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ధైర్యం నింపేందుకు అధినేత చంద్రబాబు టిడిఎల్పి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలిలో జరిగిన పరిణామాలపై, శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చించారు.ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు.

Advertisement

ఎవరూ వైసీపీ వైపు వెళ్ళొద్దని, పార్టీ అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా సమావేశంలో ప్రభుత్వ విధానాలకు సంబందించిన వ్యవహారాలను వీడియోలు రూపంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చూపించారు.

అలాగే టీడీఎల్పీ సమావేశంలో రెండు సినిమా సన్నివేశాలను చూపించారు.ప్రభుత్వ నిర్ణయాలను పోలుస్తూ వీడియోలు ప్రదర్శించారు.

ఢిల్లీ నుంచి దౌల్తాబాద్‌కు రాజధానిని మార్చిన మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సినిమాతోపాటు ప్రజలను హింసించే 23వ రాజు పులికేసి సినిమా క్లిప్పింగులను ప్రదర్శించారు.సినిమా సన్నివేశాలను చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవ్వు ఆపుకోలేకపోయారు.ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు కూడా ఇదే విధంగా ఉన్నాయంటూ ఈ సందర్భంగా వారు జోకులు వేసుకున్నారు.

మండలిలో టీడీపీకి 32 మంది ఎమ్మెల్సీలుండగా సమావేశానికి 23 మంది హాజరయ్యారు.అయితే సమావేశానికి రాలేమంటూ ఐదుగురు ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ ముందుగానే సమాచారమిచ్చారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నేతలు ఎవరూ మద్దతు పలకవద్దని, అన్ని పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా మారతాయంటూ బాబు వారికి ధైర్యం నూరిపోశారు.

Advertisement

తాజా వార్తలు