బాబు బెంగంత లోకేష్ పైనే?

రాజకీయ చాణిక్యుడు గా పేరున్న నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు చేసిన వ్యూహరచన ఫలించలేదు దాని ఫలితంగానే ఆ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది.

దారుణ ఓటమి తో పార్టీ శ్రేణులంతా నీరుగారిపోయారు.

వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుండి వారిపై విరుచుకుపడుతూ వారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టుల ద్వారా తోసిపుచ్చుతూ తన మార్క్ రాజకీయాన్ని అధికార పార్టీకి రుచి చూపిస్తున్నారు.మరి అలాంటి చంద్రబాబు గారు వయసు రీత్యా 2024 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించ లేరు అందుకనే లోకేష్ కు అవకాశం ఎక్కువగా ఇస్తున్నారు.2014 ఎన్నికలలో లోకేష్ ను ఎమ్మెల్సీ గా గెలిపించి మంత్రి వర్గంలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు.లోకేష్ కి కావాల్సిన అనుభవం అంతా అందించారు.

ChandraBabu Worried About Nara Lokesh, TDP Chandrababu, Mangaligiri, Nara Lokesh

వైసీపీ పార్టీ ఆరోపణలు చేసినట్లు రాజధాని విషయంలో అవినీతి జరగలేదని అక్కడి ప్రజలకు న్యాయం చేశామని మాటలతోనే కాక చేతలలో కూడా నిరూపించడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ ను 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేయించారు.పార్టీ నాయకులు చెబుతూ వస్తున్న అబద్ధాల ఫలితమే ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు.

2024 ఎన్నికల నాటికి టీడీపి మెయిన్ పేజ్ గా నారా లోకేష్ ను ఉంచి తను వెనకుండాలని బాబు గారు భావిస్తున్నారు.అందుకు తగ్గట్టు వ్యూహరచన చేస్తున్నారు.

Advertisement

మరి బాబు గారు పడుతున్న కష్టాన్ని తెలుసుకొని నారా లోకేష్ నిజమైన నాయకుడిగా ఎదగగలరా? ఆయనను ప్రజలు ఆదరించగలరా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు