రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనుసరించాల్సిన వ్యవహాలపై టిడిపి జనసేన బిజెపి( TDP Janasena BJP ) ఉమ్మడి సమావేశాన్ని విజయవాడలో బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggupati Purandareswari ) నివాసంలో మూడు పార్టీల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చన్న నాయుడు( Atchennaidu ) జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) తోపాటు, ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జి అరుణ్ సింగ్ సహ ఇన్చార్జి సిద్ధార్థ సింగ్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు.
రెండు గంటలపాటు సమావేశంలో ఎన్నికల ప్రచారం మేనిఫెస్టో రూపకల్పన మూడు పార్టీల అగర్ నేతలు కలిసి పాల్గొనాల్సిన సభలు తదితర అంశాలపై చర్చించారు.
ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల కోడ్ ను కూడా లెక్కచేయకుండా కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అచ్చన్న నాయుడు బిజెపి నేతల దృష్టికి తీసుకువచ్చారు అటువంటి అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాలని, అలాగే రాజధాని అమరావతి( Amaravati ) పోలవరం ప్రాజెక్టులను( Polavaram Project ) పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని జగన్( Jagan ) పాలనలో విధ్వంసం అయిన రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని భరోసాను ప్రజలకు ఇవ్వాలని బిజెపి నేతలను కోరారు ప్రధాని నరేంద్ర మోడీ ( PM Narendra Modi ) పాల్గొనే ఎన్నికల సభల గురించి చర్చికి వచ్చినప్పుడు ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున రాష్ట్రంలో మూడు సభలకు హాజరయ్యే విధంగా చూస్తామని బిజెపి నేతలు తెలిపారు.
ఈ సభానంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అనేక అంశాలను మూడు పార్టీల నేతలు ప్రస్తావించారు కేంద్రంలో 400 లోక్సభ స్థానాలు రాష్ట్రంలో 160 పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ఎన్డీఏ అధికారంలోకి రావాలన్నది మా లక్ష్యం డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి పరుగు పెడుతుంది వైసిపి పాలనలో వ్యర్ధంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కలిసి పని చేస్తాయి అని అచ్చన్న నాయుడు పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాబోయే రోజుల్లో ప్రచురించాల్సిన పాంప్లెట్ లు, రూపొందించాల్సిన నినాదాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన వీధి విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు మనోహర్ తెలిపారు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉందని ఏప్రిల్ 4 8 తేదీల్లో జరిగే సమావేశాల్లో అన్ని అంశాలను సమన్వయం చేసుకొని ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు.