తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇంత దయనీయమా...??

తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణా కోస్తా ఇలా అన్ని ప్రాంతాలలో ఒక స్టార్ హీరో ఇమేజ్ కి ఉన్నంత పాపులారిటీ ఉండేది.ఒక రాజ్యానికి సైన్యం ఎలా ఉండేదో అలాంటి కరుడుగట్టిన టీడీపీ నేతలు బలైన కార్యకర్తలు టీడీపీ వెన్ను దన్నుగా ఉండేవారు…ఆరోజుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు అంటేనే కాంగ్రెస్ నేతలకి గుండెల్లో రైళ్లు పరిగేట్టేవి.

 Tdp Bad Situation In Telangana-TeluguStop.com

అయితే గతమెంతో ఘనం కానీ భవిష్యత్తు అంధకారం అన్నట్టుగా తెలంగాణలో తెలుగుదేశం నేతలు ఇప్పుడు పాత రోజులు తలుచుకుని మురిసిపోయే పరిస్థితి ఏర్పడింది.

సరే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు సగానికి సగం మంది టీడీపీ నేతలే అనుకోండి.ఇదిలాఉంటే

ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి తలుచుకుంటే ఎంతటి దయనీయంగా మారిపోయిందంటే.కాంగ్రెస్ వాళ్ళ అడుగులకి మడుగులు వత్తుతున్నట్టుగా ఉంది…ఈ సారి తెలంగాణలో ఎన్నికల్లో తమకంటూ సొంతంగా బలం లేక, మహాకూటమిలో చేరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు దయపెడితే అన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్లుగా ఉంది టీడీపీ పరిస్థితి…చివరికి కాంగ్రెస్ పై ఈగ వారిలా కూటమిలో ఎవరు అలిగినా సరే తామే మొత్తం అనేట్టుగా టీడీపీ మధ్యవర్తిత్వం చేస్తోంది.

ఎలాగో బలం లేదు కాబట్టి కాంగ్రెస్ చెప్పింది చేయడం కాంగ్రెస్ కి నచ్చేటట్టు ఉండటంతో టీడీపీ పరిస్థితి మరీ దిగజారిపోయింది.ఇప్పుడు మహాకూటమిలో కాంగ్రెస్ పెద్ద దిక్కు కాబట్టి.సీట్లు ఇచ్చే పొజిషన్ లో ఉన్నది.దాంతో అహంకారం ధోరణిలో ప్రవర్తిస్తూ కూటమికే తలనొప్పులు తెస్తున్నారు.తమ పార్టీ వ్యూహల్లో వారు మునిగిపోయారే తప్ప.కూటమిలో మిగిలిన పార్టీల సీట్ల పంపకంపై దృష్టి పెట్టనే లేదు.

దాంతో కోదండరాం కాంగ్రెస్ కి 48 గంటల్లోగా సీట్ల పంపకం చేయాలని వార్నింగ్ ఇచ్చినా కాంగ్రెస్ లెక్కచేయడం లేదు.దాంతో ఒక్క సారిగా కూటమి కూలిపోతుందని భయపడుతున్న టీడీపీ కోదండరాం తో శాంతి చర్చలు జరుపుతూ కాంగ్రెస్ భాద్యతని భుజాన వేసుకుంది.

అయితే టీడీపీ కి ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎందుకు అంటే కారణం లేకపోలేదు.ఒక వేళ కూటమి కోటలు కాంగ్రెస్ తలపోగరు కారణంగానో లేక మరే ఇతర కారణాల వలనో కూలిపోతే భారీగా నష్టపోయింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అందులో సందేహం లేదు.ఈ కూటమి వంకతో తెలంగాణలో ఎదిగేద్దామని అనుకుంటున్నా టీడీపీకి ఇప్పుడు కూటమి కలిసికట్టుగా ఉండటం ఎంతో అవసరం అందుకే కాంగ్రెస్ భాద్యతని భుజాన వేసుకుని తిరుగుతోంది.ఎంతో ఘన చరిత్ర గల టీడీపీ పరువు బజారున పడుతోంది.

ఈ పరిస్థితి టీడీపీకి కలుగుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube