రాజధాని విషయంలో అసెంబ్లీ రద్దు చేస్తారా అనే సవాల్ విసరాలని టీడీఎల్పీ నిర్ణయం.నిమ్మల రామానాయుడు, టీడీఎల్పీ ఉప నేత.
రాజధాని విషయంలో జగన్ మాట తప్పారు.మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలి.
మూడు ముక్కల రాజధానిపై జగనుకు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలి.ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి సవాల్ విసరబోతున్నాం.
సభ సజావుగా జరగకూడదని ప్రభుత్వ ఆలోచన.ప్రభుత్వ మూడున్నరేళ్ల వైెపల్యాలను ఎండగడతాం.
ఏపీలో యువత నిర్వీర్యం అయింది.నిరుద్యోగం పెరిగింది.
జగన్ పాలనలో ప్రజలను పన్నులతో బాదేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వంలో వరి వేసుకుంటే ఉరే అనే పరిస్థితుల్లోకి రైతులు వెళ్లారు.
ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు పెరిగిపోయాయి.వైసీపీ నేతల ఇసుక, మద్యం దొపిడీకి అడ్డే లేకుండా పోయింది.
ప్రభుత్వ వైఫల్యాలను సమావేశాల్లో ఎండగడతాం.