ఫ్యాన్స్ కి సాయం చేసి గొప్ప మనసు చూపించిన పాప్ సింగర్

నటులు, పాప్ సింగర్స్ ని చాలా మంది అభిమానిస్తూ ఉంటారు.వారికి లక్షల్లో అభిమానులు ఉంటారు.

అభిమానుల కోసం సెలబ్రిటీలు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకిఅ అందుబాటులో ఉంటున్నారు.

వారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెబుతున్నారు.వారితో ముచ్చట్లు షేర్ చేసుకుంటున్నారు.

అయితే ఓ పాప్ సింగర్ మరో అడుగు ముందుకేసి కష్టం చెప్పుకున్న అభిమానికి క్షణాల్లో సాయం చేసి గొప్ప మనసు చాటుకుంది.ప్రఖ్యాత అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఈ సాయం చేసింది.

Advertisement

కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతున్న తరుణంలో ఆమె తన అభిమానులకు అండగా నిలబడింది.స్విఫ్ట్ తన టంబ్లర్ ఖాతా చూస్తుండగా కరోనా సోకినా ఓ అభిమాని పెట్టిన పోస్ట్ ఆమెను చాలా బాధకు గురిచేసింది.

నా జీవితం చాలా దుర్భరంగా సాగుతోంది.ఇక్కడ జీవించలేకపోతున్నాను.

న్యూయార్క్ సిటీని వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నాను అని అందులో రాసాడు.ఈ పోస్ట్ చూసిన టేలర్ వెంటనే 3000 డాలర్లు అంటే అక్షరాలా 2.2 లక్షలు ఆ అభిమాని ఖాతాకు పంపించింది.నాకు ఇన్నాళ్లు మీరు అండగా నిలిచారు.

ఇప్పుడు మీకు అండగా నేను ఉన్నాను.అధైర్యపడకండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

ఈ డబ్బు మీకు కొంత ఉపయోగపడుతుందనుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది.ఊహించని విధంగా తనకు ఇంత మొత్తంలో డబ్బు చేతికందడం, అది కూడా తాను ఎంతగానో ఆరాధించే సెలబ్రిటీ నుంచి ఈ సాయం అందడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవు.

Advertisement

స్విప్ట్ ఇలాగే మరో అభిమానికి కూడా సాయం చేసి తన ఉదారత చాటుకుంది.

తాజా వార్తలు