తాప్సికి డబ్బులు ఇవ్వమన్నారు .. అందుకే ఆ పని చేసింది

పంజాబీ అందం తాప్సి ఈమధ్య ఉండకూడని కారణాలతో వార్తల్లో ఉంటోంది.ఈమధ్య తాప్సి - రాఘవేంద్రరావు వివాదం గురించి మీరు చదువుతూనే ఉన్నారు.

ఒక ఇంగ్లీష్ కామెడి షోలో రాఘవేంద్రరావు పాటలను చిత్రీకరించే విధానం, హీరోయిన్ల నడుము చూపించే విధానం మీద కామెడి చేసిన తాప్సి, కొబ్బరికాయలతో నడుము మీద కొట్టడం ఎలాంటి శృంగారం ఉందొ తనకి అర్థం కాదు ఒక సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇచ్చింది.ఈ వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్ళాయో కూడా మీరు చూసారు.

సోషల్ మీడియా సైట్లలో తెలుగు సినిమా అభిమానులు తాప్సిని ఆడేసుకున్నారు.ఒకప్పుడు అవకశాల కోసం చేసి.

ఇప్పుడు అదే పనిని ఎద్దేవా చేస్తోంది, బాలివుడ్ లో ఎదిగగానే టాలివుడ్ చూపించిన ప్రేమను మరచిపోయింది అంటూ రకరకాల కామెంట్స్ చేసారు తాప్సి.ఐతే ఇంతా చేస్తున్నా, తాప్సి ముందు క్షమాపణ చెప్పలేదు.

Advertisement

తానేం మాట్లాడానో, దానికి కట్టుబడి ఉంటానని.రాఘవేంద్రరావు రావు గురించి లేనివి సృష్టించి చెప్పలేదని, ఉన్నవే చెప్పను, ఆ వీడియో చూసి ఆయన కూడా నవ్వుకున్నారు, కాబట్టి ఎవరికీ కూడా సారి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడింది తాప్సి.

ఈ స్టేట్మెంట్ వదిలిన రెండు రోజులకే క్షమాపణలు తెలుపుతున్నట్లు ఓ విడియో పోస్ట్ చేసింది తాప్సి.తానూ కేవలం తన మీదే జోకులు వేసుకున్నానని.

సరదాగా చేసిన పని ఇంత దూరం వెళుతుందని, ఇంతమందిని గాయపరుస్తుందని ఊహించలేదని, తానుప్పుడు ఈ స్టేజిలో ఉండటానికి రాఘవేంద్రరావు కారణమని సారి చెప్పింది తాప్సి.రెండురోజుల్లో ఇంత మార్పు ఎలా వచ్చింది ? డబ్బు కోసమే వచ్చింది అంటున్నారు ఫిలింనగర్ జనాలు.తాప్సి చాలా రోజుల తరువాత తెలుగులో చేస్తున్న చిత్రం ఆనందో బ్రహ్మ.

ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కాబోతోంది.ఇంత గ్యాప్ తరువాత తాప్సి ఓ తెలుగు సినిమా చేస్తోంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
మరోసారి జనంలోకి జగన్.. కొత్త షెడ్యూల్ విడుదల..!!

ఇలాంటి సమయంలో ఈ వివాదం తమ సినిమాకి మంచిది కాదని నిర్మతాలు భావించారట.క్ష్టమాపణలు చెప్పకపోతే తెలుగు ప్రజలు చాలామంది సినిమాని బాయ్ కాట్ చేసిన చేస్తారు, వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే సినిమాకి నష్టం, అదే జరిగితే బ్యాలెన్స్ గా ఉన్న పారితోషికం ఇవ్వమని నిర్మాతలు డిమాండ్ చేసారట.

Advertisement

అందుకే తాప్సి సారీ చెప్పిందట.

తాజా వార్తలు