తాప్సి కామెంట్స్ చూసి రాఘవేంద్రరావు ఏమన్నారో చూడండి

ఈమధ్య రాఘవేంద్రరావు పాటలపై తాప్సి చేసిన కామెంట్స్ ఎంతటి సంచలాన్నని సృష్టించాయో మీరు చూసారు.

ఒక ఇంగ్లిష్ కామెడి షోలో మాట్లాడిన తాప్సి, ఝుమ్మంది నాదం సినిమాలోని ఓ పాట మీద జోకులేస్తూ, రాఘవేంద్రరావు హీరోయిన్ల నడుము చూపించే విధానంపై కొన్ని జోకులు వేసింది.

శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయినలపై పూలు, పళ్ళు వేసిన రాఘవేంద్రరావు, తనపై మాత్రం కొబ్బరికాయ వేసారని, నడుముని కొబ్బరికాయతో కొట్టడంలో ఎలాంటి శృంగారం దాగుందో తనకి అర్థం కావడం లేదు అంటూ ముగించింది.దాంతో తాప్సి మీద సోషల్ మీడియాలో నేగేటివ్ పోస్టులు మొదలయ్యాయి.

Tapsee Reveals How Raghavendra Rao Responded On Her Comments-Tapsee Reveals How

అవకాశాలు లేనప్పుడు ఒకలా మాట్లాడి, ఇప్పుడు బాలివుడ్ వెళ్ళగానే ఒకలా మాట్లాడుతోంది, మోసగత్తె అంటూ కామెంట్స్ పడ్డాయి.వీటిమీద స్పందించింది తాప్సి.

"అసలు నేనేం అన్నాను అని.ఆయన అలాంటి పాటలకి ఫేమస్ కదా.నేను ఏదైతే ఉందొ, అదే చెప్పాను.నిజాన్ని కూడా అవమానకరంగా చూస్తే అది నా తప్పు కాదు.

Advertisement

ఆ విడియో జనాలు చూసారు, రాఘవేంద్రరావు గారు కూడా చూసారు.ఆయన విడియో చూసి నవ్వుకున్నారట.

ఆయనొక్కడే కాదు, ఆయన కుటుంబసభ్యులు కూడా నవ్వుకున్నారట.నేను వెళ్ళింది ఒక కామెడి షోకి.

అక్కడ చేయాల్సింది కామెడియే కదా.ఆయనకి కనబడని అవమానం మిగితావారికి ఎలా కనబడిందో" అంటూ కోపగించుకున్నట్టే మాట్లాడింది తాప్సి.ఇందులో ఒకటి మాత్రం నిజం.

అది కామెడి షో.అందుకే తాప్సి కామెడి చేసిందేమో.అయినా రాఘవేంద్రరావు లేని ఇబ్బంది ఈ విమర్శకులకి ఎందుకో.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు