తిరుమల( Tirumala ) శ్రీవారిని కేంద్రమంత్రి సత్య పాల్ సింగ్ భాగెల్, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.
రవి, ఆర్మీ జనరల్ చీఫ్ అనిల్ చౌహాన్( Anil Chauhan ), ప్రముఖ సింగర్ మంగ్లీ( Mangli ), వేర్వేరుగా శుక్రవారం దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా,అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.సింగర్ మంగ్లీ తోసెల్ఫీలు తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు…