తమిళ స్టార్ హీరోలు తెలుగు లో కూడా సత్తా చాటాలనే ఉద్దేశం తో తెలుగు దర్శకులతో తెలుగు లో సినిమాలు చేస్తున్నారు.ఆ మధ్య శివ కార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఆ తర్వాత తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరో గా వారసుడు అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
తెలుగు దర్శకుడు మరియు తెలుగు నిర్మాత అవడం తో ఒక తెలుగు సినిమా గానే వారసుడు ని చూడాలి అంటూ మేకర్స్ విజ్ఞప్తి చేశారు.తమిళ హీరో అవ్వడం తో ఇది తెలుగు సినిమా కాదు అంటూ వారసుడు సినిమా ను తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు.
తెలుగు లో మినిమం కలెక్షన్స్ రాలేదు.ఇప్పుడు అందరి దృష్టి ధనుష్ నటించిన సార్ సినిమా పై ఉంది.
ఎప్పుడు ఎప్పుడు ఆ సినిమా విడుదలవుతుందా అని ప్రేక్షకులు మరియు ధనుష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.తమిళం తో పాటు తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.తెలుగు లో భారీ ఎత్తున సార్ సినిమా ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఫిబ్రవరి 17వ తారీఖున సార్ సినిమా ను విడుదల చేసేందుకు కాను ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
అదే రోజున శాకుంతలం సినిమా కూడా విడుదల కాబోతుంది.దాంతో సార్ సినిమా యొక్క ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వారసుడు సినిమా మాదిరిగానే తెలుగు లో సార్ సినిమా ను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోరేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.అయితే తమిళం లో మాత్రం సార్ కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో తమిళ హీరోలకు సక్సెస్ అనేది కష్టమేనా అంటూ సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది.