తమిళ సూపర్ స్టార్ విజయ్<( Thalapathy Vijay )/em> ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ సినిమా( Goat Movie )ను చేస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా షూటింగ్ నిమిత్తం తిరువనంతపురం కి విజయ్ వెళ్లాడు.
అక్కడ ఫ్యాన్స్, ప్రేక్షకులు విజయ్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.అంతవరకు బాగానే ఉన్నా తిరువనంతపురం షూటింగ్ కు వెళ్లిన విజయ్ లుక్( Hero Vijay Look ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెద్ద జుట్టు, మీసాలు గడ్డం లేకుండా కనిపించాడు.చాలా మంది ఈ లుక్ చూసి షాక్ అవుతున్నారు.
నెటిజన్స్ ఈ లుక్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు.అసలు విజయేనా లేక ఇంకెవరైనా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
స్వయంగా విజయ్ అభిమానులు కూడా బాబోయ్ ఏంటన్న ఈ లుక్ అన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు విజయ్.ఇలాంటి లుక్ ను నీ నుంచి ఆశించలేదు అంటూ వారు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.ఇదే సమయంలో దర్శకుడు వెంకట్ ప్రభు( Director Venkat Prabhu ) పై వారు విమర్శలు చేస్తున్నారు.
కొంతమంది అయితే చాలా చండాలంగా ఉన్నారు ఇదంతా కూడా మేకప్ మహిమనేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.విజయ్ నేచురల్ లుక్ ను చెడగొట్టి ఇలా దరిద్రంగా మార్చావు.
ఈ సినిమాను జనాలు కాదు కనీసం ఫ్యాన్స్ అందరూ అయినా చూసే పరిస్థితి ఉంటుందా అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.గోట్ సినిమాలో విజయ్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో( Dual Roles ) దర్శకుడు వెంకట్ ప్రభు చూపించబోతున్నాడు.

రెండు పాత్రల్లో ఒక పాత్ర ముసలి వయసులో ఉన్న విజయ్.ఆ పాత్ర కోసం ఇలా లుక్ ను విజయ్ మార్చి ఉంటాడు అనేది తమిళ మీడియా వర్గాల్లో టాక్.రాజకీయాల్లోకి( Politics ) రాబోతున్నట్లుగా ప్రకటించిన విజయ్ చివరగా చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.అలాంటి సినిమాకు ఇలాంటి లుక్ ఏంటో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
అయితే జస్ట్ కేవలం ఆ లుక్ లో కనిపించేసరికి తట్టుకోలేకపోతున్న అభిమానులు, సినిమాలో అలాంటి పాత్రలో విజయం చూసి తట్టుకుంటారా లేదా జీర్ణించుకుంటారో లేదో చూడాలి మరి.