పెళ్లి పేరుతో మోసం చేశాడని ఎస్ఐ పై వర్ధమాన నటి ఫిర్యాదు.. !

లోకంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు అందరికి తెలిసిందే.ముఖ్యంగా చిత్రపరిశ్రమలో అయితే ఇలాంటి వివాదాలు తరచుగా వినిపిస్తుంటాయి.

కలిసి ఉన్నంతవరకు బాగానే ఉన్న జంటలు మధ్యలో ఏ కారణంగానో విభేధాలు రావడంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది.ఇకపోతే తాజాగా కోలీవుడ్ వర్ధమాన నటి రాధ, తనను ఓ ఎస్ఐ పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ, విరుగంబాక్కం స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

ఆ వివరాలను చూస్తే. సుందరం ట్రావెల్స్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రాధ, తన భర్తతో విడాకులు తీసుకుని శాలిగ్రామ్ లో కుమారుడితో కలిసి నివసిస్తుంది.

ఈ నేపధ్యంలో ఓ సినిమా షూటింగ్ లో తిరువాన్మియూరులో పని చేస్తున్న ఎస్ఐ వసంత్ రాజ్ తో పరిచయం ఏర్పడింది.ఇదివరకే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్న వసంత్ రాజ్, నటి రాధకు దగ్గరవడం, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం కూడా జరిగిపోయింది.

Advertisement

అంతే కాకుండా ఇతను రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు.ఈ క్రమంలో కొన్ని అనుకోని కారణాల వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడగా ఈ నటికి దూరం అయిన వసంత్ రాజ్ మీద ఫిర్యాదు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.

ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందట.

Advertisement

తాజా వార్తలు