హార్ట్ బ్రేక్ అయిందంటున్న తమన్నా.. ఆ హీరోనే కారణమా..?

స్టార్ హీరోయిన్ తమన్నా, సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోకు హాజరైన సంగతి తెలిసిందే.

సమంత ఈ షో ద్వారా ఇష్టమైన సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను వాళ్ల అభిమానులకు తెలిసేలా చేస్తున్నారు.

ఇప్పటికే ఈ షోలో విజయ్ దేవరకొండ, రానా - నాగ్ అశ్విన్, సైనా దంపతులు, తమన్నా పాల్గొనగా రాబోయే వారాల్లో అల్లు అర్జున్, చిరంజీవిలకు సంబంధించిన ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి.అయితే తమన్నా సామ్ జామ్ షోలో తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

నెల రోజుల క్రితం కరోనా బారిన పడి వైరస్ నుంచి కోలుకున్న తమన్నా కరోనా సమయంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.తమన్నా తన గురించి తానే చెప్పుకుంటూ నటి, కవి, కాఫీ ప్రియురాలు అని పేర్కొన్నారు.

అయితే తమన్నా కవితల గురించి ఆమె అభిమానులకు కూడా తెలియదు.సమంత తమన్నాను కవితల గురించి ప్రశ్నించగా ఎప్పుడైతే హార్ట్ బ్రేక్ అవుతుందో అప్పుడు కవితలు రాస్తామంటూ తమన్నా చెప్పుకొచ్చారు.

Advertisement

సమంతకు కూడా ఈ విషయం బాగా తెలుసని.ఎదుటివారి హార్ట్ బ్రేక్ చేసే మనుషులు సమాజంలో ఉన్నారని.

అలాంటి ఘటనలు మన జీవితంలో జరిగితే మనం కవులుగా మారతామని తమన్నా అన్నారు.అయితే తమన్నా హార్ట్ బ్రేక్ చేసిన వ్యక్తి ఎవరో మాత్రం తెలియలేదు.

అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం కొన్నేళ్ల క్రితం తమన్నా ఒక హీరోతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయని కానీ తమన్నా ప్రేమించిన హీరో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆమె హార్ట్ బ్రేక్ అయిందని కామెంట్లు చేస్తున్నారు.అయితే తమన్నా చెబితే మాత్రమే ఆమె హార్ట్ బ్రేక్ కావడానికి అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.

ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)
Advertisement

తాజా వార్తలు