కోహ్లీతో ఎఫైర్‌పై ఇన్నేళ్లకు స్పందించిన తమన్నా... అంతా అబద్దమే అంటున్న నెటిజన్స్‌

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కెరీర్‌లో గడ్డు కాలంను ఎదుర్కొంటుంది.

ఈ అమ్మడు అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకటి రెండు ఆఫర్లు ఈమెకు మళ్లీ జీవం పోస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తమిళం మరియు తెలుగులో చిన్నా చితకా పాత్రల్లో నటిస్తూ వస్తోంది.ఆ సినిమాల తర్వాత మళ్లీ పుంజుకుంటాను అనే నమ్మకంతో ఆమె ఉంది.

ఆమె నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.ఇక ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో కోహ్లీతో అఫైర్‌ గురించి మాట్లాడింది.

Tamanna Bhatia Open Ups On Relationship With Virat Kohli

2012వ సంవత్సరంలో ఒక ఇండియన్‌ బ్రాండ్‌ మొబైల్‌కు విరాట్‌ కోహ్లీతో కలిసి తమన్నా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది.ముంబయిలో యాడ్‌ షూటింగ్‌ నిర్వహించారు.యాడ్‌ షూటింగ్‌ సమయంలో ఇద్దరి మద్య కనెక్షన్‌ మొదలైంది.

Advertisement
Tamanna Bhatia Open Ups On Relationship With Virat Kohli-కోహ్లీత�

ఆ కనెక్షన్‌ అనేది చాలా కాలం సాగింది.ఇద్దరు కలిసి ముంబయితో పాటు పలు ప్రాంతాల్లో చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు.

ఇద్దరి మద్య ప్రేమ ఉందని ప్రచారం జరిగింది.అయితే తాజాగా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ అసలు కోహ్లీని తాను ఆ యాడ్‌ షూట్‌ అయిన తర్వాత ఒక్కసారి అంటే కనీసం ఒక్కసారి కూడా కలవలేదు అంటూ వ్యాఖ్యలు చేసింది.

మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ తేల్చి పారేసింది.

Tamanna Bhatia Open Ups On Relationship With Virat Kohli

తమన్నా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా జనాలు విరుచుకు పడుతున్నారు.తమన్నా చెప్పేవన్నీ కూడా అబద్దాలు.ఆమె కోహ్లీతో చాలా ప్రాంతాల్లో తిరగడం, అక్కడి వారు చూడటం జరిగింది.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

అప్పటి కొన్ని ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి.అంతగా సాక్ష్యాలు ఉంటే యాడ్‌ షూట్‌ తర్వాత అసలు విరాట్‌ను కలవలేదు అంటూ అంత సులభంగా అబద్దం ఎలా చెప్తావు అంటూ తమన్నాపై విమర్శలు చేస్తున్నారు.

Advertisement

అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత మా మద్య ఏం లేదు అని చెప్పడంకు కారణం పబ్లిసిటీ అంటూ మరి కొందరు విమర్శలు చేస్తున్నారు.మొత్తానికి విరాట్‌ కోహ్లీతో లవ్‌ ఎఫైర్‌ విషయంలో తమన్నా మరోసారి మీడియా ముందుకు వచ్చింది.

తాజా వార్తలు