పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారీ వారి పాట నుంచి ఫిబ్రవరి 13వ తేదీ కళావతి అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
ఈ పాటకు ఎంతోమంది డాన్స్ వేస్తూ ఆ డాన్స్ వీడియో లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార ఈ పాటకు అద్భుతమైన డాన్స్ వేశారు.
అలాగే శేఖర్ మాస్టర్ పిల్లలు సైతం కళావతి పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ పాటకు ఎంతోమంది డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తమను సైతం ఈ పాటకు ఎంతో సిగ్గుపడుతూ మహేశ్ బాబు వేసిన హుక్ స్టెప్ని, డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌తో కలిసి వేశారు.ఇక డాన్స్ వీడియోని స్వయంగా తమన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై స్పందించిన నెటిజన్లు సంగీత దర్శకుడు తమన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.తమన్ అధిక శరీర బరువు ఉన్నప్పటికీ ఈ పాటకు ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు అంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.
మరికొందరు తమన్ మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy