రుయా ఆసుపత్రిలో "అంబులెన్స్ రాబందుల" భరతం పట్టండి! నవీన్

రుయా సంఘటనపై "మానవ హక్కుల కమిషన్" సుమోటోగా తీసుకొని సంబంధిత జిల్లా అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలి!రుయా హాస్పిటల్ లో చనిపోయిన తన బిడ్డ శవాన్ని అంబులెన్స్ మాఫియాకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక ఆ తండ్రి భుజం మీద వేసుకొని బైక్ మీద 90 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి తీసుకెళ్లడం హృదయవిదారకం! రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇవ్వాల్సింది "నవరత్నాలు కాదు" "నవమాసాలు మోసి" అకస్మాత్తుగా చనిపోయిన కన్న బిడ్డ శవాన్ని సైతం ఇంటికి తీసుకోపోలేని దౌర్భాగ్యపు స్థితిలో ప్రభుత్వ వైద్యశాలలు ఉండడం సిగ్గుచేటు.

టీటీడీ "శ్రీ వాణి ట్రస్ట్" నిధులతో దేశవ్యాప్తంగా గుడులు కళ్యాణ మండపాలు కట్టడం కన్నా ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత అంబులెన్స్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి!శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లు జరిగితే వెంటనే రుయా ఆసుపత్రికి తరలిస్తారు అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనేక జిల్లాల నుంచి పేద ప్రజలు వైద్యం కోసం రుయా ఆస్పత్రికి వస్తారు కానీ "ఎమర్జెన్సీ వార్డులో పడకల కొరత" కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి!రుయా పరిస్థితి "అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అన్నట్లు ఎంతో అనుభవం కలిగిన వైద్యులు ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం శోచనీయం!ప్రభుత్వ,ప్రైవేటు వైద్యశాలల వద్ద అంబులెన్స్ ధరల పట్టిక ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్,జిల్లా పోలీసు యంత్రాంగం చొరవ చూపాలి!రుయా సంఘటన పునరావృత్తం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం మానవత్వంతో కఠిన నిర్ణయాలు తీసుకొని అంబులెన్స్ మాఫియాను ఉక్కు పాదంతో అణచివేయాలని డిమాండ్ చేస్తున్నాను!నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేత .

తాజా వార్తలు