వైరల్ వీడియో: ఛాంపియన్స్‌ ఇన్ ఇండియా .. టీమిండియా ఆటగాళ్లకు గ్రాండ్ వెల్​కమ్..

తాజాగా టీ20 వరల్డ్ కప్ ( T20 World Cup ) విజేతల గా నిలిచిన టీమిండియా( Team India ) ప్లేయర్స్ ఇండియాలోకి అడుగు పెట్టారు.

ఢిల్లీలో టీం ఇండియా ప్లేయర్స్ కు ఘన స్వాగతం పలికారు అభిమానులు.

విజయం సాధించిన ఐదు రోజుల అనంతరం టీమిండియా ప్లేయర్స్ అందరూ స్వదేశానికి రావడం జరిగింది.టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయం సాధించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రావాలి.

కానీ., బెరిల్ తుపాను కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇక టీమిండియా ప్లేయర్స్ కోసం ప్రత్యేక విమానంలో ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసింది బీసీసీఐ.ఢిల్లీ విమానాశ్రయంలో( Delhi Airport ) టీమిండియా ప్లేయర్స్ కు బీసీసీఐ అధికారులు, టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఘన స్వాగతం పలికారు.

Advertisement

ఇక బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జైషా, మీడియా కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.ఒక్కసారిగా టీం ఇండియా ప్లేయర్ల రాకతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఫ్యాన్స్ తో సందడిగా మారింది.ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు భారీగా అభిమానులు వచ్చి టీమిండియా క్రికెటర్లకు స్వాగతం పలికారు.

‘భారత్ మాతా కీ జై’. ‘ఇండియా.ఇండియా.

’ అనే నినాదాలతో ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్ మొత్తం మారుమోగింది.ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ( Rohit Sharma ) వరల్డ్‌ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ అభివాదం చేసాడు.

ఆ తరువాత క్రికెటర్లు అందరు బీసీసీఐ( BCCI ) ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లిపోయారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
దీపావళి గిఫ్ట్‌తో తల్లిని సర్‌ప్రైజ్ చేసిన కొడుకు.. వీడియో చూస్తే ఫిదా..

ప్రస్తుతం ప్లేయర్స్‌ మొత్తం ఐటీసీ మౌర్య అండ్ రిలాక్స్‌ హోటల్‌ లో ఉన్నారు .అనంతరం ప్రధాని మోదీ ఇంటికి వెళ్లి కలుస్తారు.మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ప్లేయర్స్‌ అందరు ముంబైకి ప్రయాణం అవుతారు.

Advertisement

సాయంత్రం నాలుగు గంటలకు ముంబైకి చేరుకుంటారు.ఇక సాయంత్రం ఐదు గంటలకు ముంబై నారీమన్‌ పాయింట్‌ నుంచి విక్టరీ పరేడ్‌ మొదలు అవుతుందని అధికారులు తెలిపారు.

రాత్రి 7 నుంచి 07:30 మధ్య వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సత్కారం ఉంటుంది.టీమిండియా దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది.టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.

తాజా వార్తలు