స్వామి వివేకానంద ఆంజనేయ స్వామి భక్తుడా..?

స్వామి వివేకానంద గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.ఆయనొక గొప్ప తత్వ వేత్తగానే అందరూ చూస్తుంటారు.

వేదాంత, యోగ తత్వ శాస్త్రాలను అవపోసన చేసిన ఆయన. రామకృష్ణ పరమ హంసకు ప్రియ శిష్యుడు అయ్యాడు.అంతే కాదండోయ్ రామకృష్ణ మఠాన్ని కూడా స్థాపించాడు.

Swami Vivekananda Is A Devotee Of Anjaneya Swami , Anjaneya Swami, Swami Vivekan

ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.కానీ ఆయనలో దైవభక్తి కూడా చాలానే ఉంది.

 స్వామి వివేకానంద ఆంజనేయ స్వామి భక్తుడు.పదేళ్ల వయసులోనే అంజన్న ప్రతిమను కొని తెచ్చుకొని ప్రతిరోజూ పూజించేవాడు.

Advertisement

స్వామి వివేకా నందకు బాల్యం నుంచే సీతారాములంటే కూడా ఇష్టం.వారి గుణగణాలకు ముగ్ధుడయ్యాడు.

శ్రీరాముడిలా ఆదర్శమైన జీవితాన్ని గడపడమే.అత్యుత్తమ లక్ష్యమని వివేకా నందకు అనిపించేది.

 ఆంజనేయ స్వామి ధాస్య భక్తి నచ్చి ఆయన భక్తుడిగా మారిపోయాడు.అందుకే నిత్యం ఆంజనేయ స్వామిని ఉపాసించే వారు.

సనాతన ధర్మ పరి వ్యాప్తి ఉద్యమంలో తనను తాను హనుమంతుడిగా పోల్చుకున్నాడు.అందరూ వాయు పుత్రుడి లాగే దేహ, ఆత్మ, బుద్ధి బలాలను కలిగి ఉండాలని చెప్పేవారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఈ మూడు శక్తులను ఉపయోగించే.ఆంజనేయ స్వామి సీతాన్వేషణ లక్ష్యాన్ని చేరుకున్నారని అంటారు వివేకానంద.

Advertisement

ఒక మనిషి సంపూర్ణ వ్యక్తిత్వానికి.హనుమంతుడే ప్రతి రూపమంటూ చెబుతుండేవారు.

స్వామి వివేకానందకు దైవ భక్తిపై నమ్మకం ఉన్నప్పటికీ.మూఢ భక్తిపై అసలు నమ్మకం లేదు.

తన మీద తనకు నమ్మకం లేని వారు దైవాన్ని కూడా నమ్మలేరని అంటుండేవారు.ఏవైనా గ్రంథాలు చదవాలనుకున్నా, దేవుడిని నమ్మాలనుకున్నా ముందు శరీరాన్ని, మనసును దృఢం చేసుకోవాలని సూచించేవారు.

తాజా వార్తలు