ప్రస్తుత సమాజంలో రోజురోజుకు అనుమానాలు, దారుణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబాలు పూర్తిగా నాశనం అవుతూ, చివరకు విషాదం మాత్రం మిగులుతుంది.
ఇటీవల కాలంలో ఎవరితో మాట్లాడిన, ఎవరి వైపు చూసినా, ఇంటికి రావడం కాస్త లేట్ అయినా, ఫోన్ లిఫ్ట్ చేయడంలో కాస్త ఆలస్యమైన అవతల వ్యక్తిలో అనుమానం అనే వైరస్ ప్రవేశించి అతి దారుణాలు చేయిస్తుంది.ఇలాంటి క్రమంలోనే భార్యపై అనుమానం పెంచుకున్న ఒక భర్త ఉన్మాది లాగా మారి భార్యతో సహా ఇద్దరు కూతుర్లను సహజీవ దహనం చేసిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని చిక్కబల్లాపుర జిల్లా శిడ్లగట్ట పరిధిలోని హెణ్ణూరు గ్రామంలో సొణ్ణేగౌడ(48), నేత్రావతి (37) దంపతులు చాలాకాలంగా నివాసం ఉంటున్నారు.వీరికి స్నేహ (11), హర్షిని (9) అనే ఇద్దరు కూతుర్లు సంతానం.
భార్య భర్తలు వ్యవసాయం చేసుకుంటూ పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.కొంతకాలం తర్వాత నేత్రావతిపై సొణ్ణేగౌడ కు అనుమానం వచ్చింది.
తన భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టాడు.

మంగళవారం రోజు మరల భార్యాభర్తలకు మధ్య మాటల యుద్ధం జరిగింది.క్రమంగా గొడవ పెరగడంతో క్షణికావేశంలో భార్యతో సహా ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.ముగ్గురు మంటల్లో కాలి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
తర్వాత సొణ్ణేగౌడ పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.అయితే మంటలలో కాలిపోతూ భార్యా పిల్లలు కేకలు వేయడంతో, చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికంగా ఈ సంఘటన అందరిని కలిచి వేసింది.







