నారా లోకేశ్ కు సీఐడీ నోటీసులపై సస్పెన్స్

టీడీపీ నేత నారా లోకేశ్ కు సీఐడీ నోటీసులపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారని తెలుస్తోంది.అయితే లోకేశ్ తన ఇంటిలో లేరని గల్లా జయదేవ్ సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అయితే ఎంపీ అనుమతి లేకుండా ఆయన ఇంట్లోకి వెళ్లలేమని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు.దీంతో లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందించే అంశంపై సస్పెన్స్ నెలకొంది.

అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ను అధికారులు ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా మరోవైపు హైకోర్టు 41 ఏ నోటీసులు జారీ చేసి లోకేశ్ ను విచారించవచ్చని వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement
నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం చేసిన పల్లవి ప్రశాంత్.. ఏం చేశారంటే?

తాజా వార్తలు