మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే.వాల్తేరు వీరయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఆ బడ్జెట్ ను మించి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుస్మిత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం.
వాల్తేరు వీరయ్య సినిమాకు చిరంజీవి కూతురు సుస్మిత క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేశారు.
వాల్తేరు వీరయ్య కథ విన్న సమయంలోనే ఈ సినిమాకు సంబంధించి క్యాస్టూమ్స్ విషయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయని సుస్మిత అన్నారు.క్యాస్టూమ్స్ విషయంలో నాన్నతో చర్చిస్తానని నాన్నకు నప్పే చొక్కాలను స్పెషల్ గా రూపొందించానని ఆమె కామెంట్లు చేశారు.అమ్మ ఇన్ పుట్స్ తీసుకుంటానని సుస్మిత పేర్కొన్నారు.

నాన్న చిరంజీవితో సినిమాలను నిర్మించాలని సుస్మిత వెల్లడించడం గమనార్హం.మంచి కథ తీసుకొస్తే నిర్మాతగా అవకాశం ఇవ్వడానికి సిద్ధమేనని సుస్మిత వెల్లడించారు.ప్రస్తుతం కథల వేటలో ఉన్నానని సుస్మిత చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కథల వేటలో ఉన్నానని సుస్మిత అభిప్రాయం వ్యక్తం చేశారు.రంగస్థలంలో చరణ్, వాల్తేరు వీరయ్యలో చిరంజీవిలలో ఎవరు మాస్ గా కనిపించారనే ప్రశ్నకు చిరంజీవి మాస్ గా కనిపించారని సుస్మిత చెప్పుకొచ్చారు.

వాల్తేరు వీరయ్య సినిమా కోసం నాన్న తన లుక్ ను మార్చుకున్నారని సుస్మిత చెప్పుకొచ్చారు.కొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయని సుస్మిత కామెంట్లు చేయడం గమనార్హం.ప్రస్తుతం శ్రీదేవి శోభన్ బాబు మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉందని సుస్మిత చెప్పుకొచ్చారు.చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతోంది.
చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.








