తెలుగు సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాఫ్యామిలీ నుంచి ఇప్పటికి ఎంతో మంది హీరోలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
చిరంజీవి మెగాస్టార్( Chiranjeevi ) గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఆయన కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలోనే పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా సుస్మిత( sushmita ) మాట్లాడుతూ.ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదు.ఇక్కడ ప్రతిరోజూ ఒక యుద్ధంలా ఉంటుంది.
సినీ పరిశ్రమపై బోలెడంత ప్రేమతో పాటు పనిని ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలి.అప్పుడే మనం ముందుకు వెళ్లగలము అని తెలిపింది.
కేవలం గ్లామర్ కోసం ఉండాలనుకుంటే మాత్రం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది.కాస్ట్యూమ్ డిజైనర్( Costumer designer ) గా కెరీర్ ప్రారంభంలో తనపై వచ్చిన నెగిటివిటీ గురించి కూడా సుస్మిత స్పందించింది.
సోషల్ మీడియా, పలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన వార్తలు చూసి అప్పట్లో తాను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది.

వాటిని వింటూ కూర్చుంటే ముందుకెళ్లలేం.కాబట్టి బయట జరుగుతున్న విషయాలు, మాటలు పట్టించుకోకుండా ముందుకుపోతే నెగిటివిటీ గురించి బాధపడం అని తెలిపింది సుస్మిత కొణిదెల.అనంతరం చిరంజీవి గురించి స్పందిస్తూ.
నాన్న కాస్ట్యూమ్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు.ఏమాత్రం కొంచెం బాగో లేకపోయినా కూడా ముఖం మీదే బాగోలేదని చెప్పేస్తూ ఉంటారు అందుకే నిన్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది సుస్మిత.
కాగా సుష్మిత తన తండ్రి చిరంజీవి పని చేసే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ వ్యవహరిస్తోంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.