చనిపోయిన తర్వాత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నేషనల్ వైడ్ గా విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు.యంగ్ టాలెంటెడ్ హీరోగా బాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సుశాంత్ సింగ్ ఊహించని విధంగా గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
మానసిక ఒత్తిడి తట్టుకోలేక సుశాంత్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన యావత్ భారతదేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే చనిపోయిన తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని టాక్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అతని మరణం మారింది.
ఇదిలా ఉంటే తాజాగా టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 50 జాబితాలో ఊహించిన విధంగా అతను మొదటి స్థానంలో నిలిచారు.

2020కి గాను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించిన సర్వేలో మెజారిటీ యువత సుశాంత్ కి మద్దతుగా నిలబడ్డారు.దీంతో చాలా మంది బాలీవుడ్ హీరోల అందరిని వెనక్కి నెట్టి సుశాంత్ ఇండియన్ వైడ్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా గుర్తింపుని దక్కించుకున్నారు.నిజంగా చనిపోయిన తర్వాత ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు.
గత ఏడాది సుశాంత్ ఏ స్థాయిలో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు అనేది ఈ సర్వే బట్టి తెలుస్తుంది.సుశాంత్ చనిపోయిన తర్వాత ఆయన చివరి చిత్రం చిచ్చోరే ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే.
ఇప్పుడు ఇలా మోస్ట్ డిజైరబుల్ మెన్ గా గుర్తుకు దక్కించుకోవడం ద్వారా మరోసారి బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హాట్ టాపిక్ గా మారాడు.