ఓటమి విజయానికి తొలిమెట్టు అని నమ్మేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.ఒక్కసారి ఓటమి ఎదురైతే కెరీర్ పరంగా సక్సెస్ దక్కదని చాలామంది భావిస్తారు.
అయితే ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు ఫెయిల్ అయినా కష్టపడితే సక్సెస్ తనకు సొంతమవుతుందని ఒక యువకుడు నమ్మడంతో పాటు ఆ నమ్మకాన్ని నిజం చేసుకున్నాడు.ఈ యువకుడి సక్సెస్ స్టోరీ( Success Story ) గురించి తెలిసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
ఈ యువకుడు గ్రేట్ అని కామెంట్లు చేశారు.
సూర్యభాన్ యాదవ్( Suryabhan Yadav ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
మహారాష్ట్ర రాష్ట్రంలోని( Maharashtra ) నల్లసోపరా పట్టణానికి చెందిన సూర్యభాన్ యాదవ్ బాల్యం నుంచి చదువులో ముందువరసలో ఉండేవారు.ఐఐటీ భువనేశ్వర్ లో సీటు సాధించిన సూర్యభాన్ యాదవ్ బీటెక్ చదివే సమయంలో యూపీఎస్సీ సివిల్ పరీక్ష( UPSC Civils ) రాయాలని భావించారు.
ఇందుకోసం కోచింగ్ కూడా తీసుకున్నారు.

2017 సంవత్సరంలో తొలిసారి పరీక్షకు హాజరు కాగా సూర్యభాన్ క్వాలిఫై కాదు.రెండు, మూడోసారి పరీక్ష రాసిన సమయంలో కూడా అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి.2020 సంవత్సరంలో సూర్యభాన్ 488వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.వచ్చిన ర్యాంక్ ప్రకారం సూర్యభాన్ ఐ.ఆర్.ఎస్ కు ఎంపికయ్యారు.అదే సంవత్సరం ఐ.ఎఫ్.ఎస్ పరీక్షలో సైతం సూర్యభాన్ మంచి ఫలితాలను సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత కూడా సూర్యభాన్ ఐఏఎస్ కోసం ప్రయత్నించి ఈ ఏడాది విడుదలైన ఫలితాలలో 27వ ర్యాంక్ సాధించడం గమనార్హం.తుది ఫలితాలలో సూర్యభాన్ యాదవ్ 1027 మార్కులు సాధించారు.సూర్యభాన్ యాదవ్ ఎంతోమందికి స్పూర్తిగా నిలవడం గమనార్హం.సూర్యభాన్ యాదవ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నా సింపుల్ గా ఉండటానికే ఇష్టపడుతున్నారు.సూర్యభాన్ యాదవ్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







