సెన్సేషనల్ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. కానీ!

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగునాట కూడా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఆయన చేసే ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు.

 Suriya To Do Movie With Bala, Suriya, Director Bala, Keerthy Suresh, 2d Entertai-TeluguStop.com

ఆయన చేసిన పలు సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్‌లుగా నిలిచాయి.అయితే ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ యమస్పీడుగా దూసుకుపోతున్నాడు.

కేవలం థియేటర్ సినిమాలే కాకుండా వెబ్ మూవీలను సైతం ఆయన తెరకెక్కిస్తున్నాడు.కాగా తాజాగా ఆయన మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో చేతులు కలిపాడు.

తమిళనాట దర్శకుడు బాలా అంటే ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.బాలా నుండి ఓ సినిమా వస్తుందంటే అందులో ఎలాంటి కంటెంట్ ఉంటుందా అని అక్కడి సినిమా క్రిటిక్స్ కూడా ఆశగా చూస్తుంటారు.

అలాంటిది బాలాతో కలిసి సూర్య ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.అయితే ఇక్కడే ఉంది అసలు మ్యాటర్.

బాలాతో సూర్య చేయబోయేది హీరోగా కాదట.సూర్య సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో బాలాతో సూర్య ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోగా అథర్వను తీసుకున్నారట చిత్ర యూనిట్.

ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోందట.

ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించడంతో పాటు తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సూర్య ప్లాన్ చేస్తున్నాడు.కీర్తి సురేష్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

దాన్ని క్యాష్ చేసుకునేందుకే సూర్య ఈ సినిమాను తెలుగునాట కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నాడట.మరి సూర్య కోసం బాలా ఎలాంటి కథను పట్టుకొస్తున్నాడో తెలియాలంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube