రేపు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Hero Ram Charan ) పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.చరణ్ పుట్టినరోజును మెగా అభిమానులు పండగలా జరుపుకుంటున్నారు.
చరణ్ పుట్టినరోజు కానుకగా మగధీర సినిమా రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో జరిగాయి.
మగధీర సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ కూడా ప్రసారం కానుందని తెలుస్తోంది.అయితే చరణ్ పుట్టినరోజు( Ram Charan Birthday ) సందర్భంగా చరణ్ తల్లి సురేఖ చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సురేఖ( Ram Charan Mother Surekha ) 500 మందికి అన్నదానం చేశారు. అపోలో ఆస్పత్రి( Apollo Hospitals )లో ఉన్న దేవాలయం పుష్కరోత్సవం కార్యక్రమానికి చినజీయర్ స్వామీజీ( Chinnajeeyar Swamiji ) ముఖ్య అతిథిగా హాజరు కాగా సురేఖ తన చేతితో స్వయంగా వండిన వంటకాలను ఉపాసన చేతుల మీదుగా భక్తులను వడ్డింపజేశారు.
అత్తమ్మాస్ కిచెన్( Athammas Kitchen ) ఇన్ స్టాగ్రామ్ పేజ్ ద్వారా ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. చరణ్ సుకుమార్ కాంబో( Charan Sukumar Combo ) సినిమాకు సంబంధించి కూడా తాజాగా ప్రకటన వచ్చేసింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రామ్ చరణ్ 17వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి, కార్తికేయ తమ కామెంట్ల ద్వారా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.వరుసగా మూడు సినిమాలతో అదిరిపోయే లైనప్ ను సిధ్దం చేసుకున్న రామ్ చరణ్ ఈ మూడు సినిమాలతో భారీ విజయాలను అందుకుంటారని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.ఈ సినిమాల షూటింగ్ వేగంగా జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.అన్నదానం చేయడంతో చరణ్ తల్లి సురేఖ మనస్సు ఎంతో గొప్పదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.