ఆహా.. మహేష్ బాబు అందం వెనుక సీక్రెట్ ఇదా.. సూపర్ స్టార్ వీడియో మీరు చూశారా?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మహేష్ బాబు ఈ వయసులో కూడా యంగ్ గా కనిపిస్తూ అదే జోష్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.నాలుగు పదుల వయసులో కూడా హ్యాండ్ సమ్ లుక్ లో కనిపిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఆకట్టుకుంటున్నారు మహేష్ బాబు.

అయితే మహేష్ బాబు నాలుగు పదుల వయసులో కూడా అంత గ్లామర్ గా కనిపించడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మహేష్ అభిమానులు ఎంతగానో ఆసక్తిని కనబరుస్తున్నారు.మహేష్ బాబు కేవలం గ్లామర్ విషయంలోనే కాకుండా తన ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు.

మరి మహేష్ అంత అందంగా కనిపించడానికి జిమ్ లో ఎంత కష్ట పడుతున్నారు అన్న విషయాన్ని తెలియజేసే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో పాత వీడియోనా,లేక కొత్త వీడియోనా అన్నది అర్థం కాలేదు.

Advertisement

ఈ వీడియోను చూసిన మహేష్ అభిమానులు ఆ వీడియో పై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.తన ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి మహేష్ బాబు ఎంతలా కష్టపడుతున్నారో ఈ వీడియోలో తెలుస్తోంది.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి త్వరలోనే విడుదల చేయాలి అని చిత్ర బృందం భావిస్తున్నారు.

ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు