తన వీరాభిమానితో సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. ఇంతకీ తనెవరో తెలుసా?

దర్శకుడు బివి ప్రసాద్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నాయుడుగార‌బ్బాయి.ఈ సినిమాలో అంబిక హీరోయిన్‌ పాత్ర పోషించింది.

రావు గోపాలరావు, రంగనాథ్ విలన్లుగా నటించారు.చక్రవర్తి సంగీతం అందించగా.

ల‌క్ష్మ‌ణ్ గోరే సినిమాటోగ్రాఫ‌ర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.రాజీవి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రామ‌లింగేశ్వ‌ర‌రావు, గోపీనాథ్ కలిసి ఈ సినిమాను నిర్మించారు.

నిజానికి రామ‌లింగేశ్వ‌ర‌రావుకు కృష్ణ అంటే ఎంతో అభిమానం.ఆ అభిమానం మూలంగానే ఈ సినిమా చేశాడు కృష్ణ‌.

Advertisement

ఈ సినిమా సమయంలో రామ‌లింగేశ్వ‌ర‌రావు వ‌య‌సు కేవ‌లం 22 సంవత్సరాలు మాత్రమే కావడం విశేషం.ఈ సినిమాకు కథ రచయితగా దాసరి నారాయణ రావు పనిచేశారు.

కానీ.నిజం చెప్పాలంటే ఈ సినిమా జితేంద్ర హీరోగా చేసిన హిందీ సినిమా కారవాన్ ఆధారంగా రాజశ్రీ కథ రాశాడు.

డైలాగులు కూడా ఆయనే రాశారు.కానీ కథ దగ్గర దాసరి పేరున వేశారు నిర్మాతలు.

దానికి కారణం అప్పట్లో ఆయనకున్న క్రేజ్ ను వాడుకోవడానికే అలా వేశారు అనేది టాక్.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

నటీనటుల అద్భుత నటన.కథలో మంచి బలం, చక్కటి డైలాగులు, అంతకు మించి స్క్రీన్ ప్లే.అన్నీ కుదరడంతో సినిమా అనుకున్న దానికంటే ఘన విజయం సాధించింది.

Advertisement

ఈ సినిమా విజయం అనంతరం కృష్ణ‌కు రామ‌లింగేశ్వ‌ర‌ రావు రెగ్యుల‌ర్ ప్రొడ్యూస‌ర్ గా మారిపోయాడు.కృష్ణతో ఎప్పుడు సినిమా చేద్దామన్నాతను ఓకే చెప్పేవాడు.అస్సలు కుదరని సమయంలో మాత్రమే నో చెప్పేవాడు.

ఎప్పుడో ఒకసారి కాల్షీట్లు అడ్జెస్ట్ కాకపోతే.చిన్న హీరోల‌తో మాత్రమే సినిమాలు చేసేవాడు రామలింగేశ్వర రావు.

స్టార్ హీరోల దగ్గరకు మాత్రం వెళ్లేవాడు కాదు.అంతటి అనుబంధం ఏర్పడింది వీరి మధ్య.

నాయుడిగారబ్బాయితో మొదలైన వీరి ప్రయాణం పదుల సినిమాల పాటు కలసి కొనసాగింది.అభిమాన హీరోతో సినిమాలు చేయడం సంతోషంగా ఉందని రామలింగేశ్వరరావు భావిస్తే.

తన అభిమాని సినిమాలు చేయడం పట్ల గర్వంగా ఫీలయ్యేవాడు కృష్ణ‌.

తాజా వార్తలు