విమానం కోసం ఆ పత్రిక వారిని బ్రతిమిలాడినా సూపర్ స్టార్ కృష్ణ...కారణం ఏంటి ?

సినిమా ఇండస్ట్రీ లో పెద్ద వారిని గౌరవించడం, తనకు మొదటి అవకాశం ఇచ్చిన వారిని జీవితాంతం గుర్తుంచుకొని వారిని తమ ఆరాధ్య గురువుగా భావించడం అనేది నేటి రోజుల్లో చాలా తక్కువగా జరుగుతుంది.కానీ తొలితరం నటులు అలా ఉండేవారు కాదు.

 Super Star Krishna Asked For Flight To Attend Director Aadurthi Subbarao Last Ri-TeluguStop.com

ఎన్టీఆర్ నుంచి కృష్ణ, శోభన బాబు వరకు పెద్దలను ఎంతో మర్యాదగా చూసేవారు.అవకాశం ఇచ్చినవారిని సదా అభిమానించే వారు.

వారికి ఏమైనా జరిగితే ఏదైనా చేయడానికి వెనకాడే వారు కాదు.ఆలా సూపర్ స్టార్ హీరో కృష్ణ జీవితంలో ఒక సంఘటన జరిగింది.

అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ కు హీరో గా తొలి అవకాశం ఇచ్చింది దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు.

ఆయనలోని నటుడిని గుర్తించి హీరో గా అవకాశం ఇచ్చారు కాబట్టి కృష్ణ గారు ఆదుర్తి వారిని తన గురువుగా ఎల్లప్పుడూ భావించే వారు.ఆదుర్తి సుబ్బారావు గారు 1975 లో చెన్నై లో కన్ను మూసారు.

ఆ సమయం లో కృష్ణ పాడి పంటలు సినిమా కోసం షూటింగ్ లో ఉన్నారు.ఈ షూటింగ్ గుంటూరు లో జరుగుతున్న సమయం లోనే ఆదుర్తి గారు కన్ను మూసారు.

Telugu Chennai, Krishna, Paadi Pantalu, Hindu, Tollywood-Movie

తనను ఇంతవాణ్ణి చేసిన తన గురువు గారు కన్ను మూస్తే ఆఖరి చూపు చూసుకోవాలని కృష్ణ గారు చాల ప్రయత్నించారు.కానీ ఆ టైం లో చెన్నై కి వెళ్ళడానికి ఎలాంటి ట్రాస్పోర్ట్ సదుపాయాలు లేకపోవడం తో చాల బాధ పడ్డారు.ఆఖరికి అప్పటి సెన్సేషనల్ పత్రిక అయినా హిందూ యాజమాన్యం కి ఒక విమానం ఉండేది.వారిని ఎలాగోలా బ్రతిమిలాడి ఆ విమానం పట్టుకొని ఉన్నపళంగా చెన్నై కి చేరుకొని గురువు గారిని కడసారి చూపు చూసుకొని మళ్లి షూటింగ్ కి వచ్చారట.

Telugu Chennai, Krishna, Paadi Pantalu, Hindu, Tollywood-Movie

ఇక నిన్నటి రోజు కె విశ్వనాధ్ దత్తపుత్రుడిగా ఒక హీరో గా ప్రకటించి అనేక సినిమాల్లో అవకాశాలు ఇచ్చి స్టార్ గా చేస్తే చనిపోతే చివరి చూపుకు కాదు కదా పెద్ద కర్మ, చిన్న కర్మ లకు కూడా వచ్చి కుటుంబానికి ఒకసారి మొహం చూపించలేకపోయేంత బిజీ లో ఉన్నారు.ఇది నాటి రోజుకు నేటి రోజులకు ఉన్న తేడా.పెద్దలు అంటే మర్యాద లేదు.తమకు జీవితం ఇచ్చారనే కృతజ్ఞత లేదు.ఇంకా ముందు రోజుల్లో ఎన్ని విడ్డురాలు చూడాల్సి వస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube